Monday, May 6, 2024

నిర్మాత అన్బు చెజియ‌న్ పై మూడోసారి ఐటీ దాడులు-ఉలిక్కిప‌డిన త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌

ఐటీ అధికారులు త‌మిళ సినీ నిర్మాత‌..ఫిల్మ్ ఫైనాన్షియ‌ర్ జీఎన్ అన్బు చెజియన్ పై రెయిడ్ చేవారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, మధురైలలో ఆయనకు చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలలో సోదాలు జగురుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే రెయిడింగ్స్ జరుగుతున్నాయి. అన్చు చెజియన్ నివాసం, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. మధురైలోనే దాదాపు 30 చోట్ల సోదాలు జరుగుతుండగా… చెన్నై, ఇతర ప్రాంతాల్లో 10 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. అన్బు చెజియన్ పై ఐటీ దాడులు కొనసాగుతుండటంతో తమిళ సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. అన్బుపై ఐటీ దాడులు జరగడం ఇది మూడోసారి. మరోవైపు కోలీవుడ్ కు చెందిన మరి కొందరు ప్రముఖులు కూడా ఐటీ స్కానర్ లో ఉన్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో, పలువురు సినీ పెద్దలు కలవరానికి గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement