Monday, April 29, 2024

హిజాబ్​ ధరించడంపై ఎట్లాంటి నిషేధం లేదు: కేంద్ర మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వి

దేశంలో హిజాబ్​ ధరించడంపై ఎట్లాంటి నిషేధం లేదని, రాజ్యాంగ హక్కులు, విధుల గురించి ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ. కర్నాటకలో వివాదాస్పద హిజాబ్​ అంశంపై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను లేవనెత్తారు. అయితే ఈ విషయం కోర్టులో ఉంది.. దేశంలో హిజాబ్ ధరించడంపై ఎట్లాంటి నిషేధం లేదన్న విషయం స్పష్టంగా ఉంది.. వాస్తవానికి కొన్ని సంస్థలకు వారి సొంత క్రమశిక్షణ ఉంది. డ్రెస్ కోడ్, యూనిఫాం, రాజ్యాంగం యొక్క హక్కుల గురించి మాట్లాడేటప్పుడు, రాజ్యాంగ విధుల గురించి కూడా మాట్లాడాలి అన్నారు కేంద్ర మంత్రి అబ్బాస్​.

మీడియాతో మాట్లాడ్డానికి ముందు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి 37వ “హునార్ హాత్” ను ప్రారంభించారు నఖ్వీ.. హస్త కళలు, హస్తకళాకారుల సాధికారత కోసం ప్రయత్నిస్తున్నామని, “హునార్ హాత్” వల్ల ఏడేళ్లలో సుమారు 8 లక్షల మంది చేతివృత్తిదారుల, హస్తకళాకారులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను లభించాయని నఖ్వీ పేర్కొన్నారు.

హునార్ హాత్ అనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యొక్క “సెల్ఫ రిలయంట్​ ఇండియా”తో పాటు స్థానికుల గళాల ​ ప్రచారానికి “విశ్వసనీయ బ్రాండ్”గా మారింది. ఈ చొరవ దేశంలోని సుదూర ప్రాంతాల నుండి, సాంప్రదాయ కళ, హస్తకళలో నిమగ్నమై ఉన్న లక్షలాది కుటుంబాలకు శక్తిని, ఉత్సాహాన్ని నింపిందని, వారి పూర్వీకుల వారసత్వానికి మార్కెట్‌ను అందించిందని నఖ్వీ చెప్పారు. హునార్ హాత్ ప్రధాని నరేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని బలోపేతం చేస్తోందని, దేశ సాంప్రదాయ కళ, నైపుణ్యం, అద్భుతమైన వారసత్వాన్ని రక్షించడానికి, ప్రోత్సహించడానికి హునార్ హాత్ సమర్థవంతమైన వేదిక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

కాగా, గత ఏడాది డిసెంబర్‌లో కర్నాటకలోని ఉడిపి ప్రీ- యూనివర్శిటీ గర్ల్స్ కాలేజీలో హిజాబ్​ ధరించిన ఆరుగురు విద్యార్థిలను కాలేజీలోకి రానివ్వలేదు. అప్పుడు మొదలైన ఈ గొడవ కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలకు పాకింది. దీంతో ప్రజా శాంతికి భంగం కలిగించే ఎలాంటి వస్త్రాన్ని ధరించరాదని ఫిబ్రవరి 5వ తేదీన ప్రభుత్వం ఉత్వర్వులిచ్చింది. వాటిని రద్దు చేయాలని కర్నటక హైకోర్టును కొంతమంది స్టూడెంట్స్​ ఆశ్రయించారు. కోర్టు గత వారం విచారణను పూర్తి చేయగా… త్వరలో తుది తీర్పును వెలువరించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement