Sunday, May 5, 2024

Big Breaking: వ‌న్‌ప్ల‌స్ 10టి లాంచ్ ఈవెంట్ ప్రారంభం.. సంద‌డి చేస్తున్న అభిమానులు (వీడియో)

వ‌న్‌ప్ల‌స్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇవ్వాల (బుధ‌వారం) లాంచ్ అవుతోంది. దీనికి సంబంధించి ఆ కంపెనీ సీఈవో రాబిన్ లూ మాట్లాడారు. నార్త్ అమెరికాలో జ‌రుగుతున్న ఈ ఈవెంట్‌ని లైవ్ ద్వారా చూసే వెసులుబాటు ఉంది. ఈ ఈవెంట్‌లో త‌మ స్మార్ట్‌ఫోన్లు, ఇత‌ర ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన అంశాల‌ను కంపెనీ ప్ర‌తినిధులు వివ‌రించారు. ఒక్కో అంశాన్ని వివ‌రిస్తూ తాము ఎట్లా ప్ర‌జ‌ల అభిమానాన్ని పొందుతున్నామ‌నే విష‌యాల‌ను తెలియ‌జేశారు.

YouTube video

ఇక‌.. మొద‌టి నుంచి తాము స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఎన్నో ప్ర‌యోగాలు చేస్తున్నామ‌ని, అంతిమంగా అవి ప్ర‌జ‌ల‌కు మెరుగైన అనుభూతిని ఇవ్వ‌డానికే ఉంటాయ‌ని సీఈవో రాబిన్ చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకొచ్చిన అన్ని స్మార్ట్‌ఫోన్లు, ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌లో ఒక్కో ఫోన్‌లో ఒక్కో స్పెషాలిటీ ఉంటుందున్నారు. టెక్నాల‌జీ డెవ‌లప్ అవుతున్న కొద్దీ తాము కూడా స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్స్‌ని మ‌రింత స్పీడ్‌గా డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్టు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement