Sunday, May 5, 2024

హన్మకొండలో అస్థి పంజరం కలకలం..ఆ అస్థిపంజరం మేల్ లేక ఫిమేల్.. ?

వరంగల్ , (ప్రభ న్యూస్) : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో అస్థి పంజరం లభ్యం కావడం కలకలం రేపుతోంది. హన్మకొండ నడిబొడ్డున గుర్తు తెలియని అస్థి పంజరం బయట పడింది. ప్రముఖ దేవాలయంగా పేరుగాంచిన శ్రీ భద్రకాళి గుడి నుండి కాపువాడకు వెళ్ళే రోడ్డులోని క్వాలర్ట్ వద్ద సంచిలో గుర్తు తెలియని అస్థి పంజరం లభ్యమైంది. ఆ కాల్వర్ట్ వద్ద ఒక టీ షర్ట్ కన్పించింది. కానీ ఆ టీ షర్ట్ అస్థిపంజరంకు చెందినదా..? కదా..? అనే విషయాన్ని ఇప్పుడే నిర్ధారించలేని పరిస్థితి నెలకొంది. కాల్వర్ట్ వద్ద లభ్యమైన అస్థిపంజరం మగ వారిదా..? మహిళకు చెందినదా..? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అస్థిపంజరంకు ఫోరెనిక్స్ పరీక్షలు నిర్వహిస్తే తప్ప, ఏ విషయం తెలియదని హన్మకొండ ఇన్స్ పెక్టర్ వేణు మాధవ్ తెలిపారు. అలాగే అస్థిపంజరం ఎవరిదై ఉంటుందా అనే విషయంపై కూడ స్పష్టత రాలేదు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే గాక తెలంగాణ వ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసులను పరిశీలించే పనిలో పడ్డారు. లభ్యమైన అస్థిపంజరం మెల్ లేక ఫిమేల్ అనే విషయం తెలియగానే, అస్థి పంజరం పొడవు ఆధారంగా మిస్సింగ్ కేసులను పరిశీలించి, పోల్చి చూసే అవకాశాలున్నాయి. అస్థిపంజరంలోని వ్యక్తిని ఎవ్వరు, ఎప్పుడు మర్డర్ చేసి ఉంటారా అనే కోణంలోను ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశాలున్నాయి. అస్థిపంజరం సంచిలో లభ్యం కావడంను బట్టి చంపి, మృతదేహంను సంచిలో కుక్కి ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకే మురికి కాల్వ కాల్వర్ట్ కింద పడవేసి ఉంటారని కూడ అనుమానిస్తున్నారు. మురికి కాల్వ ద్వారా వచ్చే దుర్వాసన వల్ల మృతదేహం కుళ్ళి పోయిన వాసనను ఎవ్వరు గుర్తించి ఉండక పోవచ్చునని అనుమానిస్తున్నారు. హంతకులు పకడ్బందీ ప్లాన్ ప్రకారమే హత్య చేసి, నగర నడిబొడ్డున గల కాల్వర్ట్ కింద పడవేసి ఉంటారని భావిస్తున్నారు.

అస్థిపంజరం బయట పడింది ఇలా..
వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయం నుండి కాపువాడ మధ్య భద్రకాళి గుడి ముందు నుండి స్మార్ట్ రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. కాపువాడ సమీపంలో కాల్వర్ట్ నిర్మాణం చేపట్టారు. సదరు కాల్వర్ట్ పైన కొంత వర్క్ డామేజీ కావడంతో సదరు కాంట్రాక్టర్ మరమ్మత్తులు చేయడం కోసమై ఆదివారం కాల్వర్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సంచి అనుమానాస్పదంగా కనబడింది.ఆ సంచిలో నుండి అస్థిపంజరంకు చెందిన ఆనవాళ్లు కనిపించడంతో 100 కాల్ చేశాడు. హన్మకొండ పోలీసులు రంగంలోకి దిగి కేసును ఛేజించే పనిలో నిమగ్నమయ్యారు. సెక్షన్ 174 కింద కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హన్మకొండ ఇన్స్ పెక్టర్ వేణు మాధవ్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement