Tuesday, May 21, 2024

నైతిక విద్య అవ‌స‌రం – రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా ఉండొద్దు – మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌

తాను ఏ మ‌త గ్రంథాల‌కు వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేకం కాన‌ని తెలిపారు క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌. గుజ‌రాత్ పాఠ‌శాల‌ల్లో భగవద్గీత ప్ర‌వేశ‌పెడుతున్న అంశంపై సిద్ధ‌రామయ్య స్పందించారు. మ‌న దేశానిది భిన్నమైన సంస్కృతి అని ఆయ‌న అన్నారు. మ‌నం సమైక్య జీవన విధానంలో ఉన్నామని చెప్పారు. తాము హిందూ ధర్మంపై నమ్మకం కల్గినవారమ‌న్నారు. బ‌డుల్లో పాఠ్యాంశాలలో భగవద్గీత ద్వారా నైతిక విద్య నేర్పించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. తాము రాజ్యాంగపరంగా లౌకిక‌వాద‌ విధానాలను నమ్ముతామని తెలిపారు. బ‌డుల్లో భగవద్గీతతో పాటు ఖురాన్‌, బైబిల్‌ను విద్యార్థులకు నేర్పినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. విద్యార్థులకు అవసరమైనది గుణాత్మకమైన విద్య అని తెలిపారు. భగవద్గీతను మ‌న‌ ఇళ్లలో పిల్లలకు చెబుతారని ఆయ‌న అన్నారు. రామాయణ, మహాభారతం వంటివాటిని కూడా పిల్లలకు నేర్పుతార‌ని గుర్తు చేశారు. నైతిక విద్య అవసరమని, కానీ అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాత్రం ఉండకూడ‌ద‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement