Sunday, September 15, 2024

ఎంత బుర‌ద చ‌ల్లితే.. అంతగా క‌మ‌లం విక‌సిస్తుంది.. ప్ర‌ధాని మోడీ

గుజ‌రాత్ క‌లోల్ లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో పాల్గొన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖర్గే ‘రావణ’ ప్రకటనపై ప్రధాని ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీలో ఓ నీచమైన పద్దతి ఉంద‌నీ, ప్రస్తుతం తనని ఎక్కువగా దూషించాలనే దానిపై ఆ పార్టీ పోటీ జరుగుతోందని అన్నారు. డిసెంబర్ 5వ విడత ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోడీని ఎవరు ఎక్కువగా దూషించగలరు అనే దానిపై పోటీ నెలకొంది అని అన్నారు.

అనంతరం ఖర్గే వ్యాఖ్యలపై మోడీ విరుచుకుపడ్డారు. గౌరవనీయులైన ఖర్గే నన్ను రావణుడితో పోల్చారు.. అసలూ రాముడి ఉనికిని ఎప్పుడూ నమ్మని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రామాయణం నుంచి ‘ రావణుడిని’ తీసుకువచ్చారని, తన ఇలాంటి కఠిన పదాలను ఉపయోగించిన వారు కనీసం పశ్చాత్తాపపడలేదని అన్నారు. డిసెంబర్ 5న‌ జరగనున్న రెండో విడత ఎన్నికల సందర్భంగా ప్రధాని గుజరాత్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2014లో మీరు నన్ను ఢిల్లీకి పంపినప్పుడు దేశంలోరెండు మొబైల్ ఫోన్‌ ఫ్యాక్టరీలు ఉండేవని, నేడు 200కి పైగా ఉన్నాయని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ మిత్రులు చెవులు విప్పి వినాలని, ప్రజాస్వామ్యంపై విశ్వాసం, అవిశ్వాసం ఉండాలని అన్నారు. ఎంత బురద వేస్తే అంత కమలం వికసిస్తుందని చ‌మ‌త్క‌రించారు ప్ర‌ధాని.

Advertisement

తాజా వార్తలు

Advertisement