Wednesday, April 17, 2024

పోలీస్ కిష్టయ్య త్యాగం మరువలేనిది : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ఖిలా వరంగల్ పడమర కోట చమన్ లో జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి సభ మాజీ కార్పొరేటర్, ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు బయ్య స్వామి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పడమర కోట చమన్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి, పోలీస్ కిష్టయ్య చిత్రపటాలకు నివాళులార్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ క్రిష్టయ్య త్యాగం మరువలేనిది. తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వీరుడు కిష్టయ్య అన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఆర్థిక సాయం చేసి అండగా నిలిచింది, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకున్నారు అని గుర్తు చేశారు. ముదిరాజుల కోసం ప్రభుత్వం సొసైటీలను ఏర్పాటు చేసి సబ్సిడీలు అందజేస్తుంద‌న్నారు. చెరువులో మత్సకారుల కోసం చేప పిల్లలను పంపిణీ చేపట్టడం జరుగుతుంద‌ని, 67 ఏండ్లలో సమైక్యపాలకులు కుల వృత్తులను ద్వంసం చేశార‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట సాదనతో అద్బుతంగా అభివృద్ది ఫలాలు అందుతున్నయ‌న్నారు. రాజకీయాలు ముఖ్యం కాదు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ఎజెండా.. అద్బుతమైన సూపర్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాం అన్నారు. కుల మతాలను రెచ్చగొడుతూ కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నయ్ వారి కుట్రలను తిప్పికొట్టాల‌న్నారు. ఖిలా వరంగల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాం.. మీకు దగ్గరలోనే జిల్లా కేంద్రం ఏర్పాటవుతుంద‌న్నారు. ఈ కార్యక్రమం లో 37,38 డివిజన్ల కార్పొరేటర్లు బోగి సువర్ణ-సురేష్, భైరబోయిన ఉమా-దామోదర్ యాదవ్, కార్పొరేటర్ చింతాకుల అనిల్, ముదిరాజ్ నాయకులు చింతాకుల సునీల్, సంగరబోయిన చందర్, సంగరబోయిన విజయ్, అభిలాష్, రావుల రాజేష్, బొల్ల సుజాత, సిరబోయిన శ్రీనివాస్, సిరాబోయిన సోమేశ్వర్, మధు, రాజేష్, జనార్దన్, బంగారి నవీన్, ముదిరాజ్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement