Sunday, April 28, 2024

దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న చంద్రగ్రహణం..

భారతదేశ వ్యాప్తంగా చంద్ర గ్రహణం కొనసాగుతోంది. కాగా ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. అయితే తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం పాక్షికంగా ఉంది. గ్రహణంతో చంద్రుడు ఎర్రగా మారనున్నాడు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా గ్రహణ సమయంలో మార్పులున్నాయి. ఢిల్లీలో సాయంత్రం 5.28 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమైంది. ముంబైలో సాయంత్రం 5.59 గంటలకు ప్రారంభం కానుంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్రగ్రహణం ప్రభావంతో పలు ఆలయాలు మూతపడ్డాయి. హైదరాబాద్ లో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ మేరకు సాయంత్రం 5.40 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు చంద్రగ్రహణం ఉండనుంది. అటు తిరుపతిలో సాయంత్రం 5.41గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు చంద్రగహణం సమయం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement