Friday, May 17, 2024

Breaking: సెప్టెంబ‌ర్ 13న ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్‌.. సరికొత్త ఫీచర్స్​తో మార్కెట్లోకి

ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్‌లో జాప్యం జరుగుతుందనే అంచ‌నాలతో తాజా లీక్స్​ వస్తున్నాయి.. అయితే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీలో ఎటువంటి జాప్యం ఉండ‌ద‌ని ఈ లీక్స్​ వెల్లడిస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 13న ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ లాంఛ్ చేస్తుంద‌ని ఐడ్రాప్ న్యూస్‌లో లీక్స్‌యాపిల్‌ప్రొ వెల్ల‌డించింది. అయితే ఐఫోన్ లాంఛ్ ఈవెంట్‌పై టెక్ దిగ్గ‌జం ఎలాంటి స‌మాచారాన్ని అప్​డేట్​ చేయలేదు. ఈ ఈవెంట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వ‌హిస్తారా, ఆన్​లైన్​ ద్వారా ఉంటుందా అనే వివ‌రాల‌ను కూడా టిప్‌స్ట‌ర్ వెల్ల‌డించ‌లేదు.

ఇక లేటెస్ట్ ఐఫోన్స్‌తో పాటు ఎయిర్‌పాడ్స్ ప్రొ2, మరో మూడు యాపిల్ వాచ్‌ల‌తో పాటు ప‌లు ఇత‌ర ఉత్ప‌త్తుల‌ను కూడా ఈ ఈవెంట్‌లో యాపిల్ క‌స్ట‌మ‌ర్ల ముందుకు తీసుకువ‌స్తుంద‌ని టిప్‌స్ట‌ర్ లీక్స్‌యాపిల్‌ప్రొ అంచ‌నా వేస్తోంది. యాపిల్ ప్ర‌స్తుతం జూన్ 6న జ‌రిగే త‌న డెవల‌ప‌ర్ల కాన్ఫ‌రెన్స్ డ‌బ్ల్యూడ‌బ్ల్యూడీసీ 2022 ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది. ఈ స‌ద‌స్సులో యాపిల్ ఐపాడ్ఓఎస్‌, మాక్ఓఎస్ కోసం న్యూ వెర్ష‌న్ ఐఓఎస్ 16ను ప్ర‌క‌టించ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఇక యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో 4 నూత‌న ఐఫోన్ మోడ‌ల్స్‌ను లాంఛ్ చేయ‌నుంది. ఈ ఏడాది మినీ ప్లేస్​లో మ్యాక్స్ మోడ‌ల్‌ను తీసుకురానుంది. 2022లో యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ పేరుతో 4 మోడ‌ల్స్‌ను లాంఛ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement