Monday, April 29, 2024

ది బ్యాట్ మ‌న్ రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టిన ‘ఆర్ ఆర్ ఆర్’

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం రికార్డుల‌ని సృష్టిస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ నెల తొలివారంలో విడుద‌లైన‌ ‘ది బ్యాట్‌మ‌న్’ సినిమా రికార్డుల‌ను తొలి రోజు ‘ఆర్ఆర్ఆర్’ బ‌ద్ద‌లు కొట్టింది. తొలి రోజు ప‌రంగా వ‌సూళ్ల విష‌యంలో ‘ఆర్ఆర్ఆర్’ నంబ‌ర్ 1 స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాలో రూ.4.03 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా, న్యూజిలాండ్‌లో రూ.37.07 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. ఇక అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు వచ్చాయి. ఈ విష‌యాల‌ను వివ‌రిస్తూ బాలీవుడ్ సినీ విమ‌ర్శ‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement