Saturday, May 18, 2024

Fame of TS | దేశ‌దేశాల్లో తెలంగాణ ఖ్యాతి.. గ్రీన్ యాపిల్ అవార్డులు సీఎంకు అంద‌జేత‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణ, పునరుద్ధరణ చేసిన అయిదు కట్టడాలకు ప్రపంచ ప్రఖ్యాత ‘ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డుల’ను లండన్ లో అందుకుంది. ఈ అవార్డుల‌ను MA&UD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, HMDA మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ స్వీక‌రించారు.

కాగా, ఇవ్వాల (బుధ‌వారం) రాత్రి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయ‌న కలిశారు. తెలంగాణ రాష్ట్రం గెలుచుకున్న అవార్డులను సీఎంకు అందజేశారు. తన లండ‌న్‌ పర్యటన విశేషాలను వివరించారు. తెలంగాణ కట్టడాలకు అంతర్జాతీయ వేదిక మీద అందుకున్న ప్రశంసలు, తదితర ప్రత్యేకతలను సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఈ సందర్భంగా అర్వింద్ కుమార్ ను సీఎం మరోసారి అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement