Tuesday, May 14, 2024

అమెజాన్ బంఫర్ ఆఫర్.. తెలంగాణ యువకుడికి రూ.1.20 కోట్ల జీతం

తెలంగాణ యువకుడు జాక్‌పాట్ కొట్టాడు. అమెరికాలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో రూ. 1.20 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. వనపర్తి జిల్లా పాన్‌గల్  మండలంలోని కేతేపల్లికి చెందిన అనీష్‌ కుమార్‌ రెడ్డి ఈ ఘటన సాదించారు. అనీష్ కుమార్ కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. ఈ క్రమంలో అనీష్‌కుమార్ హైదరాబాద్‌లోనే చదువుకున్నాడు. గతేడాది జనవరిలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మిస్సోరీ విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌లో చేరాడు. గత నెలతో అతడి విద్యాభ్యాసం పూర్తయింది. తాజాగా, అక్కడ అమెజాన్ నిర్వహించిన ఇంటర్వ్యూకు హాజరై టెక్నికల్ విభాగంలో టీం లీడర్ ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. దీంతో అనీష్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement