Sunday, May 5, 2024

పాల‌న‌కు నూత‌న వేదిక – తెలంగాణ ప్ర‌గ‌తి వీచిక‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న తరాలు, భవిస్యత్‌లో పెరిగే శాసన సభ్యుల సంఖ్య, మంత్రులను దృష్టిలో పెట్టుకొని సర్వాంగ సుందరంగా, అచ్చం ఇంద్రభవనంలా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి సిద్ధమ వుతున్నది. కొత్త హంగులు, ఏ రాష్ట్రంలో లేని అద్భుత సౌక ర్యాలతో సకల వసతులతో తెలంగాణ సచివాలయం అలరా రేందుకు ప్రజలకు చేరువవుతున్నది. కొత్త సచివాలయ ఆకృతి ఆకర్శణీయంగా, అన్ని హంగులతో ఛాంబర్లు, విశాలమైన కారిడార్లు, సమావేశ మందిరాలు, పచ్చిక బయళ్లు, షౌంటేన్లు, షాండిలీయర్లు, నలువైపులా విశాలమైన రహదారులు, కాంప్లెక్స్‌, గుడి, మసీదు, చర్చి వంటి వాటితో చారిత్రాత్మక భవన నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. చారిత్రాత్మక శైలి, అధునాతన హంగులు విరాజిల్లేలా కొత్త సచివాలయం రెడీ అయింది. 11 అంతస్తులతో నిర్మితమైన భవనం రాజప్రసాదాన్ని తలపిస్తోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భవనం సిద్ధమైంది. మధ్యలో ఐదు అంతస్తుల ఎత్తుతో భారీ గుమ్మటాలు కను విందు చేస్తున్నాయి. 26.98 ఎకరాల సువిశాల స్థలంలో హెలీ ప్యాడ్‌ సహా అన్ని హంగులూ కలపోతగా ఒక్కదగ్గరే పాలన అంతా కొలువుదీరనున్నది. ఆరో అంతస్తులో సౌత్‌ వెస్ట్‌ అంటే నైరుతి మూలలో వాస్తుకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ చాంబర్‌ పూర్తి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వసతులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో సిద్ధమైంది. తూర్పు ముఖంగా ఉన్న భవనంలో ఆరో అంతస్తులో నైరుతి దిక్కుగా సీఎం కేసీఆర్‌ చాంబర్‌ ఉండగా, భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లుగా వచ్చే 100 ఏళ్లు చెక్కు చెదరకుండా భవనం శోభాయమానంగా నిర్మించారు.

వర్షం నీటిని ఒడిసి పట్టే విధానంలో నూతన ఒరవడితోపాటు, ఒక చిన్న రిజర్వాయర్‌, సోలార్‌ విద్యుత్‌ ఉపకరాలతో సంప్ర దాయ, ఆధునికతల కలబోతగా భవనం కనువిందు చేస్తోంది. దేశంలోనే అతి ఎత్తయిన భవనాల్లో ఒకటిగా సచివాలయం ఖ్యాతి గడించనుంది. ఈ భవనం ఎత్తు 265 అడుగులు కాగా, జాతీయ చిహ్నంతో కలిపితే 278 అడుగులు. 11 అంతస్తులుగా కనిపించే భవనంలో ఆరు అంతస్తులే ఉంటాయి. డెక్కన్‌, కాకతీయ శిల్పకళాకృతిలో భవనం శోభితమవుతున్నది.
ఈ నెల 30న ప్రారంభానికి ఇప్పటికే ముహూర్తం ఖరా రైంది. పలు సందర్భాలుగా వాయిదా పడుతూ వచ్చిన తెలం గాణ నూతన సచివాలయానికి గ్రహణం వీడనుంది. అత్యంత సుందరంగా, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, సకల హంగు లతో తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా సచి వాలయం నిర్మితమైంది. తొలుత ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించాలని యోచించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. కాగా ఎంతో ప్రతిష్టాతక్మంగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్‌ భవన్‌గా నామకరణం చేశారు. తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులకు 2019 జూన్‌ 27న కేసీఆర్‌ భూమి పూజ నిర్వహించారు. సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో సకల సౌకర్యాలతో, అధునాతన పద్దతిలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. భూమి పూజ చేసిన సమయంలో ఈ నిర్మాణ పనులను 9 మా సాల్లో పూర్తి చేయాలని తొలుత భావించారు. అయితే కరోనా కారణంగా సచివాలయ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. గత ఏడాది దసరా నాటికే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ అప్పటికీ పనులు పూర్తి కాలేదు.

పార్కింగ్‌.. పచ్చిక బయళ్లు….
కొత్త సచివాలయం పార్కింగ్‌ స్థలంలో 300 కార్లు, ఆరు వందల ద్విచక్ర వాహనాలు పార్క్‌ చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్తులో ఫొటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్‌ గ్యాల రీ, రెండు, మూడో అంతస్తుల్లో కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు- ఉంటాయి. ఆరో అంతస్థులో సీఎం కేసీఆర్‌ చాంబర్‌ ఉంటు-ంది. ఏప్రిల్‌ 30న అందుబాటులోకి రానున్న నూతన పరి పాలనా సౌధం 9లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలవనుంది. విశాలమైన కారిడార్లతో ఎకో ఫ్రెండ్లీ వాతావరణంతో సౌర విద్యుత్‌ వ్యవస్థతతో తణుకులీలనుంది. గ్రీన్‌ బిల్డింగ్‌ మార్గదర్శకాలతో భవనం నిర్మితమైంది. 2020 జనవరి 4న ప్రారంభైన నిర్మాణ పనులు మొదట రూ.400 కోట్ల అంచనా వ్యయంతో, ఆ తర్వాత పెరిగిన వ్యయం కారణంగా రూ.617 కోట్లకు చేరుకుంది. మొత్తం విస్తీర్ణం 29.68 ఎకరాలుకాగా వాస్తు దోషాలను నివారించి 20 ఎకరాల్లో దీర్ఘచతు రస్రాకా రంలో కాంప్లెక్స్‌ నిర్మితమైంది. దక్కన్‌, కాకతీయ శైలిలో ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్ట్‌ డిజైన్‌తో ఆరు అంతస్తుల్లో భవనం పూర్తిస్థాయికి చేరింది. భవనంపై ఐదు అంతస్తుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్‌ టవర్‌ నిర్మించారు. 11 అంతస్తుల ఎత్తు నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తుకే పరి మితం కానుంది. సీఎం కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం ఆరో అంతస్తులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 16మంది మంత్రుల కార్యాలయాలను 2నుంచి ఐదో అంతస్తు వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి, రెండో అంతస్తుల్లో జీఏడీ, ఆర్ధిక శాఖలు, 3నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్రటరీ, కమిషనర్‌, మొత్తం సిబ్బంది ఒక శాఖకు చెందిన పాలనా వ్యవహారం అంతా ఒకేచోట కొలువు దీరనుంది.

గుమ్మటాలతో ప్రత్యేకత…
7నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు ఉంటాయి. 2 ప్రధాన గుమ్మటాలు, 34 చిన్న గుమ్మటాలు ఉంటాయి. ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తు ఐదు టన్నుల బరువుతో జాతీయ చిహ్నమైన 4 సింహాలుంటాయి. భవనం మధ్యలో విశాలమైన కోర్ట్‌ యార్డ్‌ వచ్చేలా డిజైన్‌ ఉంది. ప్రధాన భవనం 2.45 ఎకరాల్లో, కోర్ట్‌ యార్డ్‌ 1.98 ఎకరాల్లో విస్తరించి ఉంది.

- Advertisement -

ప్రత్యేక ద్వారాలు… లిఫ్టులు…
ఆరో అంతస్తుకు ప్రత్యేకంగా లిఫ్టును ఏర్పాటు చేశారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా సీఎం కోసం ఈ లిఫ్టును వాడనున్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఉన్నతాధి కారులకు, సందర్శకులకు వేర్వేరుగా లిఫ్టులు, ద్వారాలను ఏర్పాటు చేశారు. భవనం చుట్టూ వాహనాలు తిరిగేలా రహదా రులను నిర్మించారు. వెలుపల హెలీప్యాడ్‌, పచ్చిబయళ్లు, వాటర్‌ ఫౌంటేన్లు ఉంటాయి. సిబ్బంది వాహనాల పార్కింగ్‌కు 2.45 ఎకరాలను కేటాయించారు. సందర్శకుల వాహనాలకు వెలుపల 1.21 ఎకరాల్లో పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక కాంప్లెక్స్‌ బైట ఆలయం, మసీదు, చర్చి తదితరాలను 8 ఎకరాల్లో నిర్మించారు. అత్యంత అధునాతన భద్రతా ఏర్పాట్లు, బుల్లెట్‌ ఫ్రూఫింగ్‌ వంటి చర్యలు పూర్తి స్థాయికి చేరుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement