Thursday, April 25, 2024

ప్రజల ప్రాణాలు ముఖ్యమా? లేక ఎన్నికలా?: హైకోర్టు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలు ముఖ్యమా ? లేక ఎన్నికల ముఖ్యమా అన్ని నిలదీసింది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం తీరునూ తప్పుపట్టింది.

‘’ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమనిస్తున్నారా ? ఎస్ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా?’’ అని ప్రశ్నించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఏకాభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎస్ఈసీ పేర్కొంది. ఫిబ్రవరిలో కరోనా రెండోదశ మొదలైనా.. ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని నిలదీసింది. ఎన్నికలను వాయిదా వేయడానికి సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదా? అంటూ మండిపడింది. కనీసం ఎన్నికల ప్రచార సమయాన్ని కూడా కుదించ లేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణ వదిలేసి ఎన్నికల పనుల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement