Saturday, April 20, 2024

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ పై హైకోర్టు ఆగ్ర‌హం….

హైద‌రాబాద్ – క‌రోనా సెకండ్ వేవ్ విజృభిస్తున్న స‌మ‌యంలో రెండు న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు, అయిదు మునిసిపాలీటీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం ప‌ట్ల హైకోర్టు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. ఈ ఎన్నిక‌ల‌పై దాఖ‌లైన పిల్ ను నేడు విచారించిన హైకోర్టు ఎన్నిక‌ల క‌మిష‌న్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది..ఫిబ్ర‌వరిలో సెకండ్ వేవ్ ప్రారంభ‌మైనా ఏప్రిల్లో ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌డం ఏమిట‌ని నిల‌దీసింది.. క్షేత్ర స్థాయి ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఎన్నిక‌లకు వెళ్ల‌డం ఏమిట‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.. ప్ర‌జ‌లు ప్రాణాలు పోతుంటే ఎన్నిక‌లు ముఖ్య‌మ‌య్యాయా అంటూ ఎన్నిక‌ల సంఘం అధికారుల‌ను క‌డిగేసింది.. య‌ద్దం వ‌చ్చినా, అప‌త్కాలంలో ప్ర‌జ‌లు ఉన్నా ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందేనా అంటూ ప్ర‌శ్నించింది.. ప్ర‌భుత్వ స‌మ‌న్వ‌యంతో ఎన్నిక‌లకు వెళ్లామ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ న్యాయ‌వాది ఇచ్చిన స‌మాధానంపై మ‌రింత మండిప‌డింది.. ఎన్నిక‌ల నిర్వ‌హించే విష‌యంలోనూ, వాయిదా విష‌యంలో ఎన్నిక‌ల సంఘానికి అధికారం లేదా అంటూ ఎన్నిక‌ల క‌మిష‌న్ విధులు, బాధ్య‌త‌ల‌ను గుర్తు చేసింది.. క‌నీసం ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యాన్ని సైతం కుదించ‌క‌పోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డంతో ఆయా ప్రాంతాల‌లోని అధికారులు క‌రోనా నియంత్రణ‌ను దూరం పెట్టి ఎన్నిక‌ల విధుల‌లో పాల్గొన వ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డిదంటూ ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌ట్టింది.. ప్ర‌జ‌ల‌ను కాపాడ‌వ‌ల‌సిన స‌మ‌యంలో ఈ ఎన్నిక‌లు ఏమిట‌ని అంటూ నేటి మ‌ధ్యాహ్నం ఎన్నిక‌ల సంఘానికి చెందిన అధికారులు హైకోర్టు లో హాజ‌రుకావ‌ల‌సిందిగా ఆదేశాలు జారీ చేసింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement