Friday, May 17, 2024

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి. భారత్‌లో తెలంగాణ విలీనమై 74 ఏండ్లు పూర్తయ్యి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో తెలంగాణ వజ్రోత్సవాల నిర్వహణ, పోడుభూముల సమస్య పరిష్కారం తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అలాగే పలు అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement