Thursday, April 25, 2024

తెలంగాణ బడ్జెట్ లో దేనికెంత‌… రాబ‌డి ఎలా?

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలతో అలరారేలా సరికొత్త పంథాలో తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ చివరి అంకానికి చేరుకున్నది. దళితబంధుకు రూ.20 వేల కోట్లతోపాటు, కొత్తింటి పథకానికి రూ.18 వేల కోట్లు, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపుతోపాటు, పెళ్లి మంటపంలోనే కొత్త జంటలకు ఆర్థిక సాయం అందించేలా కల్యాణలక్ష్మికి మరిన్ని నిధుల పెంపు దిశగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగు తోంది. రైతుబంధుకు రూ.16 వేల కోట్లు, కేసీఆర్‌ కిట్‌కు, పౌష్టి కాహార పథకానికి రూ.1000 కోట్లు కేటాయించనున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకానికి రూ.3 వేల కోట్లు కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. ఆసరా పింఛన్లు రూ.12 వేల కోట్లకు మించనున్నాయి. రానున్న బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వనున్న ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు మోటార్‌ సైకిళ్ల వంటి పథకంతోపాటు, గీత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక పథకం ప్రకటించనుంది. కేసీఆర్‌ పోషకాల కిట్‌కు, ఆరోగ్య సంరక్షణ కిట్‌లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం, జలమం డలి ఉచిత నీటి పథకానికి, వైద్య,ఆరోగ్య శాఖకు రూ.15 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. అద్భుత ఆర్థిక క్రమశిక్షణతో ఆర్థిక పురోగమనంలో ఉన్న తెలంగాణకు కేంద్ర షరతులు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి శరాఘాతంగా పరిణ మిస్తున్నాయి. రాష్ట్రాల హక్కుగా ఉన్న స్టేట్‌ డెవలప్‌ మెంట్‌ లోన్లపై ఆంక్షలతో అప్పులను తెచ్చుకునేందుకు కేంద్ర అనుమతి అవసరమన్న కొత్త సవరణతో సరికొత్త చిక్కులకు కేంద్రం తెరతీసింది.

ఇలా తెలంగాణకు రూ.53 వేల కోట్ల రుణాల్లో రూ.15 వేల కోట్ల మేర రుణ పరిమితిని తగ్గించనుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. తాజాగా రాష్ట్రంలో వరదల కారణంగా వాగులు, వంకలు, ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక భారీగా పేరుకుపోయింది. దీంతో కొత్తగా ఇసుక రీచ్‌ల వేలం, రాయల్టిd పెంపుతోపాటు, నిరుపయోగ భూములు 32 జిల్లాల్లో గుర్తిం చిన వివరాల సేకరణ, అమ్మకం, రాజీవ్‌ స్వగృహ ఇండ్లు, కార్పొ రేషన్‌ పరిధిలోని భూముల అమ్మకం, దిల్‌కు సంబంధించిన భూములపై ఉన్న కేసును పరిష్కరించుకుని వీటి విక్రయాల దిశగా ఆలోచనలతోపాటు, గతంలో భూములు, ఇండ్లు, ప్లాట్ల మార్కెట్‌ విలువలను రెండేళ్లకు పట్టణాల్లో, మూడేళ్ల కోసారి గ్రామీణ ప్రాంతాల్లో సవరించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ఇటీవలే సవ రించింది. ఎప్పుడైనా మార్కెట్‌ విలువలను పెంచుకునేందుకు వీలుగా ఈ నిర్ణ యం తీసుకోగా మరోసారి మార్కెట్‌ విలువల సవరణకు ఉన్న అవకాశాలను, సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. తాజాగా స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో ఎల్‌ఆర్‌ఎస్‌లేని, అనుమతిలేని లే అవుట్ల ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిల్చిపోవడం, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో రాబడి తగ్గిపోవడంతో దీనిపై పున: సమీక్ష చేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా పలు శాఖల్లో పేరుకుపోయిన బకాయిలు, వన్‌టైం సెటిల్‌మెంట్లకు ఉన్న అవకాశాలు, కేంద్రం వద్ద ఉన్న బకాయిలను వసూలు చేసుకునే అవకాశాలతో బడ్జెట్‌లో అంచనాలను ప్రతిపాదించనున్నారు.
రైతు రుణమాఫీ, రైతుబంధులతోపాటు కొత్తగా సామాజిక పింఛన్ల పెంపుతో ఖజానాపై మరింత భారం పడనుంది. ఇప్పటివరకు లోటు ప్రభావం పడకుండా నెట్టుకొచ్చిన ప్రభుత్వానికి తాజా విపత్కర పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేం దుకు నిధుల సమీకరణ, అత్యవసర వ్యయాలు, వడ్డీలు, రుణాల రీపేమెంట్‌ వంటివి అతిపెద్ద సవాలుగా మారాయి. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను పెంచాలనే ప్రభుత్వ ప్రతిపాదన గత కొంత కాలంగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

ఇప్పటికే కార్పొరేషన్ల పేరుతో చేసిన గ్యారంటీ అప్పులను నిలిపివేయగా తుది దశలో ఉన్న ప్రాజె క్టులు, ఇతర అవసరాలకు నిధుల సమన్వయం రాష్ట్ర ప్రభు త్వానికి కత్తీమద సాముగా మారింది. ఇంతటి విషమ సమ యంలో ప్రజలపై భారం మోపకుండా, కొత్త పన్నులు వేయ కుండా సంపద పెంచి సరికొత్త రీతిలో ఆర్థిక సర్దుబాటు దిశగా కార్యాచరణ చేస్తోంది. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్‌ జీఎస్టీ బకాయిలు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ల పేరుతో ఏపీకి తరలిన నిధులు, ఇతర ఆదాయాలను ఒడిసిపట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకుంటోంది.
ఖర్చుల పెరుగుదలతో ఆర్థిక భారం
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన అనేక కార్య క్రమాలు, చర్యలతో గడచిన ఐదారేళ్లుగా ఆర్థిక సుస్థిరతను కొనసాగించుకుంటూ ముందుకు సాగు తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వ్యయాలు, వేత నాలతో సతమతమవుతూనే అంతే గొప్పగా ఆర్థిక స్థిరత్వానికి ముందుచూపుతో కీలక చర్యలు తీసుకుంటున్నది. గతేడాది కంటే రూ.1500 కోట్లు అదనంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లపైనే భారం పెరిగినప్పటికీ పీఆర్సీ ప్రకటన వంటి అంశాల్లో జాప్యం చేయలేదు. అంతేస్థాయిలో ఇతర వ్యయాలు కూడా భారీగా పెరగ్గా, రాబడిని అంతకంతకూ పెంచుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement