Monday, April 29, 2024

Telangana: టూరిజం హ‌బ్‌గా తెలంగాణ‌.. మరింతగా ప‌ర్యాటక ప్ర‌దేశాల అభివృద్ధి : ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా

కేసీఆర్ సీఎం అయిన తర్వాత పర్యాటక రంగానికి అత్యంత‌ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఇవ్వాల (ఆదివారం) హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హోట‌ల్ ద‌స్‌ప‌ల్లాలో అంత‌ర్జాతీయ ట్రావెల్ అండ్ టూరిజం అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో నెట్‌వ‌ర్కింగ్ మీట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌నివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న ప్ర‌భుత్వాలు తెలంగాణ‌లో ప‌ర్యాట‌క రంగాన్ని ప‌ట్టించుకోలేద‌న్నారు.

సీఎం కేసీఆర్‌, మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ ఆధ్వ‌ర్యంలో నూతన పర్యాటక ప్రదేశాలను డెవ‌లప్ చేస్తున్న‌ట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఎకో టూరిజం, హెల్త్ టూరిజం, బిజినెస్ టూరిజం, టెంపుల్ టూరిజం వంటి వాటిని ఇంట్ర‌డ్యూస్ చేస్తున్న‌ట్టు చెప్పారు. వీట‌న్నిటిని ప్రోత్సాహిస్తూ తెలంగాణ పర్యాటక ప్రదేశాలను ఒక హబ్ లాగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి దేవాలయాన్ని 1500 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించి ప్రారంభించుకున్నామ‌ని, అదేవిధంగా చారిత్ర‌క నేప‌థ్య‌మున్న రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావ‌డానికి ఎంతో కృషిచేశార‌న్నారు. ఇక‌.. నాగార్జున సాగర్ లో నూతనంగా బుద్ధవనంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా కాన్యులేట్ జ‌న‌ర‌ల్ ఆండ్రు ఏడెల్ఫ్ సన్, ఎన్ ఎస్ ఎన్‌ మోహన్, రవి చంద్రన్, వాల్మీకి, ప్రవీణ్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement