Friday, May 3, 2024

boat tragedy | పడవ​ ప్రమాదాన్ని సీరియస్​గా తీసుకున్న హైకోర్టు.. కేరళ సర్కారుకు కీలక ఆదేశాలు

కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో 22 మంది దుర్మరణం చెందారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసు ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)​ దాఖలైంది. విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఇవ్వాల (శుక్రవారం) దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, ఎక్కువ మంది పడవలలో ఎక్కకుండా నివారించడానికి గరిష్ట పరిమితి నిర్ధేశించుకోవాలని, దీన్ని ప్రతి బోట్​మీద ప్రత్యేకంగా కనిపించేలా ప్రదర్శించాలని కేరళ హైకోర్టు అధికారులను ఆదేశించింది. 22 మంది ప్రాణాలను బలిగొన్న తానూర్‌ పడవ దుర్ఘటన తర్వాత నమోదైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. బోట్​లో 37 మంది ఉండగా, గరిష్టంగా అనుమించవలసింది మాత్రం కేవలం 22 మాత్రమే.

ఇక.. జస్టిస్ దేవన్ రామచంద్రన్, జస్టిస్ సోఫీ థామస్‌తో కూడిన ధర్మాసనం అనుమతించదగిన గరిష్ట సంఖ్యలో ప్రయాణికులను ప్రస్ఫుటమైన ప్రదేశాలలో.. బోటింగ్​ ప్రారంభ, చివరి పాయింట్ల వద్ద, క్యాబిన్ల లోపల కూడా ప్రదర్శించాలని ఆదేశించింది. ఎగువ, దిగువ డెక్‌లలో కూడా గరిష్ట సంఖ్యలో ప్రయాణికులను అనుమతించాలని కోర్టు పేర్కొంది.

- Advertisement -

అమికస్ క్యూరీ సమర్పించిన సూచనలను కూడా కోర్టు పరిశీలించింది. తదుపరి విచారణకు ముందు దానిని పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను కోరింది. కేరళలోని పర్యాటకులు, ప్రయాణికుల పడవలు సరైన బీమా పరిధిలోకి వస్తాయో లేదో తనిఖీ చేయాలని కోర్టు అధికారులను కోరింది. ఈ కేసు తదుపరి విచారణను ధర్మాసనం జూన్ 7కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement