Tuesday, May 7, 2024

జీపీఎస్ తెచ్చిన చిక్కులు – పోలీస్ డిపార్ట్ మెంట్ గ్యారేజీ మెట్ల‌పై కారు న‌డిపిన మ‌హిళ‌

జీపీఎస్ వినియోగించి డ్రైవ్ చేసి అవ‌మానాల‌పాల‌యిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ మేర‌కు సోషల్ మీడియాలోనూ ఇలాంటి వార్తలు ట్రెండ్ అయిన ఘటనలు చాలా ఉన్నాయి. కాగా అమెరికాకు చెందిన ఓ మహిళ తన కారును ఏకంగా పోలీసు డిపార్ట్‌మెంట్ గ్యారేజ్ నుంచి వెళ్లుతూ జీపీఎస్ ఆన్ చేసుకుంటే అది వీధిలోకి అది దారి చూపించింది. కానీ, ఆ దారి కారులో వెళ్లడానికి కాదు.. నడుచుకుంటూ వెళ్లడానికి సరిపోయే దారి. కానీ, ఆమె తన కారులోనే పోనిచ్చింది. అలా వెళ్తుండ‌గా కింది ఫ్లోర్‌కు వెళ్లడానికి మెట్లు వచ్చాయి. ఆ మెట్లపై కారుని పోనిచ్చింది. ఆ తర్వాత ప్రధాన వీధిలోకి చేరాలని భావించింది. రెండు మూడు మెట్లు దిగిందో లేదో.. కారు డ్యామేజీ అయింది. ఈ ఘటనపై పోర్ట్‌లాండ్ పోలీసు డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీసు డిపార్ట్‌మెంట్ గ్యారేజీ గుండా ఓ 26 ఏళ్ల మహిళా డ్రైవర్ ఎస్‌యూవీ కారు నడుపుకుంటూ వెళ్లారని, అందులో పాదచారులు నడిచే ప్లాజాను కూడా కారులోనే ఆమె క్రాస్ చేశారని వివరించింది. ఆ తర్వాత ఆమె మెట్లను కూడా కారులో ఉండే దిగాలనుకున్నారని, ఆ తర్వాత మిడిల్ స్ట్రీట్‌లోకి వెళ్లాలని భావించారని పేర్కొంది. కారు మెట్లపైనే అటకాయించిందని, దీంతో తాము ఆమెను అక్కడే పట్టుకుని ఆరా తీశామని వివరించింది. తన జీపీఎస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆధారంగా కారు నడపుకుంటూ వెళ్లానని ఆమె చెప్పినట్టు తెలిపింది. కానీ, ఆ పోలీసు అధికారులు మాత్రం ఆమె బ్లడ్‌లో ఆల్కహాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టు భావించారని పేర్కొంది. దీంతో వెంటనే ఆమెకు ఓయూఐ సమన్లు పంపింది. ఆమె ఈ ప్రమాదంలో ఎవరినీ ఢీకొట్టలేదని, ఇది సానుకూల విషయం అని వివరించింది. కాకపోతే.. ఆ కారుకు కొంచెం నష్టం వాటిల్లిందని పేర్రకొంది. కాబట్టి, దయచేసి మద్యం సేవించి వాహనం నడపవద్దని పునరుద్ఘాటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement