Wednesday, May 1, 2024

నెల్స‌న్ దిలీప్ కి ఛాన్స్ ఇచ్చిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ !

త‌మిళ స్టార్ హీరో ర‌జ‌నీకాంత్ ఈ మ‌ధ్య‌కాలంలో యువ‌ద‌ర్శ‌కుల‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇస్తున్నారు. కాగా నెల్స‌న్ దిలీప్ కుమార్ టాలెంట్ ను గుర్తించి ఛాన్స్ ఇచ్చార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం త‌ర్వాత లోకేశ్ క‌న‌గ‌రాజ్ తో ర‌జ‌నీకాంత్ ఓ మూవీలో న‌టించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం లోకేశ్ క‌న‌గ‌రాజ్ క‌మ‌ల్ హాస‌న్ చిత్రం విక్ర‌మ్ తో బిజీగా ఉన్నాడు.ఇక త‌మిళనాట విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ కి మంచి క్రేజ్ ఉంది. నయనతార ప్రధాన పాత్రధారిగా ఆయన రూపొందించిన ‘కొలమావు కోకిల’ అక్కడ సూపర్ హిట్. చాలా తక్కువ బడ్జెట్ లో ఒక ఆసక్తికరమైన సినిమాను ఎలా తీయవచ్చుననడానికి నిదర్శనంగా ఆ సినిమా కనిపిస్తుంది. ఇటీవల ఆయన శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన ‘డాక్టర్’ సినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టి, కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. ఆయన దర్శకత్వంలోనే ఇప్పుడు విజయ్ ‘బీస్ట్’ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయనను పిలిచిమరీ రజనీకాంత్ అవకాశం ఇచ్చారనేది కోలీవుడ్ టాక్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement