Sunday, May 5, 2024

ఢిల్లీలో వద్దంటే చెన్నైలో.. గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం..

రిపబ్లిక్ డే పరేడ్ లో ఢిల్లీలో ప్రదర్శించాల్సిన తమిళనాడు శకటాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని, ఆ శకటాన్ని చెన్నైలో జరిగే పరేడ్ లో గ్రాండ్ గా ప్రదర్శిస్తామని సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. ప్రజల సందర్శనార్థం రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో శకటాలను ప్రదర్శనలో ఉంచనున్నట్టు స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో తమిళనాడు రాష్ట్ర శకటాన్ని ప్రదర్శనకు నిరాకరించడంపై స్టాలిన్ అసంతృప్తి వెలిబుచ్చారు.

ఎంపిక కమిటీ సూచించిన మూడు దిద్దుబాట్లు చేశామని, అయితే నాలుగో రౌండ్ సమావేశాలకు తమను ఆహ్వానించలేదన్నారు. పైగా తిరస్కరించడానికి గల కారణాలు ఏంటన్నదానిపై స్పష్టత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ కూడా పంపామన్నారు. కాగా, కేంద్ర హోంమంత్రి నుంచి శకట ప్రదర్శనను తిరస్కరించినట్టు సమాధానం వచ్చిందని స్టాలిన్ తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో తమిళ వారసత్వ సంపద ఈ ఏడాది టాపిక్‌కి ఇతివృత్తమని, దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం నిరాశ కలిగించిందని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement