Friday, April 26, 2024

Big Breaking | తమిళనాడులో సీబీఐకి నో ఎంట్రీ.. ప్రభుత్వ పర్మిషన్​ ఉండాల్సిందే!

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి తమిళనాడు ప్రభుత్వం చెక్​ పెట్టింది. ఇష్టమున్నట్టు తమిళనాడు రాష్ట్రంలోకి రావడాన్ని స్టాలిన్​ ప్రభుత్వం బుధవారం అడ్డుకట్ట వేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందని, దీనికి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని తమిళనాడు ప్రభుత్వం ఆక్షేపించింది. ఇవ్వాల మంత్రి సెంథిల్​ బాలాజీని ఈడీ అదుపులోకి తీసుకున్న సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అధికార డీఎంకే విమర్శలు గుప్పించింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఎలాంటి విచారణ చేపట్టాలన్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇక.. సీబీఐ దర్యాప్తు కోసం తన సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న పదో రాష్ట్రంగా తమిళనాడు అవతరించింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇట్లాంటి చర్యలే తీసుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసులను విచారించడానికి సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement