Thursday, April 25, 2024

T20: బంగ్లాదేశ్ టోట‌ల్ అవుట్‌!

టీ20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా మరో విజయాన్ని సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ తో గ్రూప్-1 మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 84 పరుగులకే కుప్ప‌కూలింది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 13.3 ఓవర్లలోనే విజ‌యాన్ని చేరుకున్నారు. ఈ క్రమంలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేశారు.

కెప్టెన్ టెంబా బవుమా 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వాన్ డర్ డుస్సెన్ 22, డికాక్ 16 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, మెహదీ హసన్ 1, నసుమ్ అహ్మద్ 1 వికెట్ తీశారు.

కాగా, ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ తర్వాత రెండోస్థానంలో నిలిచింది. సఫారీలు సూపర్-12 దశలో ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు, ఒక ఓటమి నమోదు చేశారు. అటు, బంగ్లాదేశ్ ఆడిన 4 మ్యాచ్ లలోనూ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement