Tuesday, April 16, 2024

ఈట‌ల విజ‌యం..’కేటీఆర్’ ట్వీట్..ఏమ‌న్నారో తెలుసా..

గడచిన 20 ఏళ్లలో టిఆర్ఎస్ ఎన్నో ఎత్తు…పల్లలను చూసిందని..హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం పెద్దగా ప్రభావం చూపదు..ప్రాధాన్యత ఉండదని అన్నారు మంత్రి కేటీఆర్.ఉప ఎన్నిక లో పనిచేసిన నేతలకు కృతజ్ఞతలు చెప్పారు మంత్రి కేటీఆర్. అలాగే తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లకు ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పారు మంత్రి కేటీఆర్. హుజరాబాద్ లో కష్టపడ్డ ఎమ్మెల్యేలు, పార్టీ లీడర్లకు , క్యాడర్ కు ధన్యవాదాలు చెప్పారు. అలాగే సోషల్ మీడియా వారియర్స్ కి అభినందనలు తెలిపారు.

బిజెపి నేత‌గా హుజూరాబాద్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన ఈట‌ల రాజేంద‌ర్ త‌న పంతాన్నే నెగ్గించుకున్నారు. అధికార పార్టీ టిఆర్ ఎస్ పై 22వేల 735ఓట్ల మెజారిటీతో విజ‌యాన్ని చేజిక్కించుకున్నారు. 21 వ రౌండ్ లోనూ ముగిసే సారికి బీజేపీకి 1,01,732 ఓట్లు, టీఆర్ఎస్ 78,997 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో ఈటల గెలుపు ఫైనల్ అయింది. అయితే మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపుపై అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… పై విధంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement