Wednesday, May 15, 2024

పాకిస్తాన్​పైకి సూపర్​సోనిక్​ మిస్సైల్​.. యాక్సిడెంటల్​ మిస్​ఫైర్​ అయ్యిందంటున్న భారత్​

పాకిస్తాన్​ భూభాగంలోకి దూసుకెళ్లిన ఇండియా మిస్సైల్​పై ఇరు దేశాల మధ్య ఆందోళన నెలకింది. అయితే.. రొటీన్​ మెయింటనెన్స్​లో భాగంగానే తమ మిస్సైల్​ ఫైర్​ అయ్యిందని, ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిందని భారత్​ అధికారులు తెలిపారు. దీన్ని తాము సీరియస్​గా తీసుకున్నట్టు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి కోర్టు విచారణకు కూడా ఆదేశించామన్నారు. అయితే ఆ క్షిపణి పాకిస్థాన్‌లోని ఓ ప్రాంతంలో ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపిన ఓ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటన చాలా విచారకరం ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయమని అధికారులు స్పష్టం చేశారు.

అయితే.. పాకిస్తాన్ ఈరోజు ఇస్లామాబాద్‌లోని భారతదేశ ఛార్జ్ డి’అఫైర్స్ ను పిలిపించింది. కాగా, మొన్న (మార్చి 9న) సాయంత్రం 6:43 గంటలకు దేశంలోని సూరత్‌గఢ్ నుండి పాకిస్తాన్‌లోకి సూపర్-సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనుకోకుండా ఫైర్​ అయ్యిందని, విదేశాంగ కార్యాలయానికి పిలిపించిన భారతీయ దౌత్యవేత్తకు పాక్​ అధికారులు తెలిపారు. భారత్​కు చెందిన “సూపర్-సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్” తమ గగనతలంలోకి రావడం రెచ్చగొట్టే చర్యగానే తాము భావిస్తున్నామని ఆరోపిస్తున్నారు. తమ తీవ్ర నిరసన తెలియజేశారు. ఈ సంఘటనపై సమగ్ర, పారదర్శక దర్యాప్తును చేయాలని కోరారు. ఆ వస్తువు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ లోని మియాన్ చున్నూ నగరానికి సమీపంలో సాయంత్రం 6:50 గంటలకు నేలపై పడింది. దీనివల్ల పౌరుల ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్టు పాకిస్తాన్​ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement