Monday, May 20, 2024

TS: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

తెలంగాణలో పాఠశాలలకు నేటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం అవుతున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఆదివారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఇవాళ్టి నుంచి జూన్ 12వ తేదీ వరకు స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తిరిగి జూన్ 13వ తేదీన పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జూన్‌ 12న ఆదివారం రావడంతో జూన్‌ 13 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఈ వేసవి సెలవులు ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఉంటాయి.

మరోవైపు మే 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి పదో తరగతి విద్యార్థులకు రివిజన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.  పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఈ రోజు నుంచి రోజుకు ఒక ఉపాధ్యాయుడు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది. పదో తరగతి విద్యార్థులకు క్లాసులు, ప్రీఫైనల్‌ పరీక్షలు యథాప్రకారం కొనసాగనున్నాయి. వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో రేపటి నుంచి ప్రైవేలు పాఠశాలలు తెరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. మే 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండగా, మే 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement