Wednesday, May 29, 2024

Breaking: ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుఖేష్ గుప్తాకు ఈడీ కస్టడీ

ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుఖేష్ గుప్తాకు ఈడీ కస్టడీ విధించింది. సుఖేష్ గుప్తాకు తొమ్మిది రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఈనెల 25వతేదీ నుంచి నవంబర్ 2వతేదీ వరకు సుఖేష్ గుప్తా ఈడీ కస్టడీలో ఉండనున్నారు. సోదాల్లో రూ.150కోట్ల బంగారు ఆభరణాలు, రూ.2కోట్ల నగదును సీజ్ చేశారు. ఎంఎంటీసీకి సుఖేష్ గుప్తా రూ.504కోట్ల భారీ మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఎంఎంటీసీ సంస్థ కొనుగోలు చేసిన బంగారం అమ్మకాలపై ఈడీ ఆరా తీసింది. ఇప్పటికే సుఖేష్ గుప్తాను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఈడీ అంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement