Sunday, March 3, 2024

Story : అమెరికాలో అగ్ర‌స్థానంలో తెలుగుభాష‌.. తెలుగు సాంప్రదాయలకి పెద్దపీట

ఈ మ‌ధ్య కాలంలో భార‌తీయులు ఇత‌ర దేశాల్లో ప‌లు కీల‌క ప‌ద‌వుల‌ని చేజిక్కించుకుని త‌మ స‌త్తాని చాటుతున్నారు.. రీసెంట్ గా బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ కూడా భార‌తీయుడు కావ‌డం విశేషం. కాగా అమెరికాలో సెటిల్ అవుతున్న భారతీయుల్లో ఎక్కువగా మన తెలుగు వాళ్లు ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగి పోతోంద‌ట‌. అమెరికాలో ఆసియన్ దేశాలను ఆధిపత్యాన్ని సైతం తెలుగు భాష వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడి కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

గత పదేళ్లలో అమెరికాలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న భాషలపై పలువురు పరిశోధనలు చెప్పారు. వీరి అంచనా ప్రకారంగా తెలుగు 150 శాతం మేర.. అరబిక్ 61 శాతం.. ఉర్దూ 45 శాతం.. చైనీస్ 35 శాతం.. గుజరాతి 31 శాతం మేర అభివృద్ధి చెందాయి. తెలుగు మాట్లాడే జాబితాలో మిస్ యూఎస్ నీనా దావులూరి.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం ఉన్నారు ..అమెరికాలో ఆసియన్ దేశాల ఆధిప్యతం ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం తెలుగు భాష ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం చూస్తుంటే మన భాష అక్కడి వారికి ఎంతలా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

గత పదేళ్లలో 150శాతం మేర పెరుగుదలను తెలుగు భాష సాధించిందంటే అమెరికన్లు మన భాషను ఎంతలా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో ఐటీ ఉద్యోగాల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. 1980 1990 లో అమెరికాలో ఏర్పడిన ఐటీ బూమ్ కారణంగా భారతీయులు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. నాటి నుంచి అమెరికన్ కంపెనీలన్నీ కూడా భారతీయ ఐటీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తోంది. వీరిలో ఎక్కువగా మన తెలుగు వాళ్లే ఉంటూ వస్తున్నారు. అమెరికాలోని తెలుగు వారంతా మన సంస్కృతికి సాంప్రదాలయాలకే పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని కొన్ని రాష్ట్రాలన్నీ ఏకంగా మన నెటీవీటీకి తగ్గట్టుగా మారిపోతున్నాయి. దీంతో అమెరికన్లు సైతం మన తెలుగు భాషను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుండ‌టం తెలుగువారికే గ‌ర్వ‌కార‌ణం.

Advertisement

తాజా వార్తలు

Advertisement