Friday, May 3, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల‌తో ముగిశాయి నేటి స్టాక్ మార్కెట్లు. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అప్ ట్రెండ్ లోనే కొనసాగాయి. ఈ క్రమంలో నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 574 పాయింట్లు లాభపడి 57,037కి చేరుకుంది. నిఫ్టీ 178 పాయింట్లు పెరిగి 17,136 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్, కన్జ్యూమర్ గూడ్స్, మెటల్ మినహా అన్ని సూచీలు లాభపడ్డాయి. ఎనిమిది సెషన్ల తర్వాత ఐటీ సూచీ కోలుకోవడం గమనార్హం. అల్ట్రాటెక్ సిమెంట్ (3.39%), మారుతి (3.37%), ఏసియన్ పెయింట్స్ (3.17%), రిలయన్స్ (3.03%), టీసీఎస్ (2.35%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా మిగిలాయి. బజాజ్ ఫైనాన్స్ (-3.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.45%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.16%), టాటా స్టీల్ (-0.89%), ఐటీసీ (-0.75%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement