Monday, May 6, 2024

వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిసిన.. స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి నష్టాల్లోనే కొనసాగాయి. అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు ఈరోజు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తతను పాటించారు. దీంతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 419 పాయింట్లు కోల్పోయి 60,613కి పడిపోయింది. నిఫ్టీ 128 పాయింట్లు కోల్పోయి 18,028 కి దిగజారింది. హె చ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ (1.13%), భారతి ఎయిర్ టెల్ (1.09%), కొటక్ బ్యాంక్ (0.83%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.23%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.10%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ నిలిచాయి.. యాక్సిస్ బ్యాంక్ (-3.54%), బజాజ్ ఫిన్ సర్వ్ (-3.04%), టైటాన్ (-2.99%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.94%), బజాజ్ ఫైనాన్స్ (-2.34%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement