Friday, April 26, 2024

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని తమ 42 కోట్ల మంది బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. ఆన్‌‌లైన్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI, యోనో, యోనో లైట్ సేవలు శుక్రవారం రాత్రి 150 నిమిషాల పాటు నిలిచిపోనున్నట్లు పేర్కొంది. జూలై 16 రాత్రి 10:45 నుంచి జూలై 17 ఉదయం 1.15 గంటల వరకు 150 నిమిషాలపాటు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేసుకోలేరని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కస్టమర్లు ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోవడం మంచిది. కొత్త ఫీచర్స్‌ను అప్‌డేట్ చేసేందుకు ఎస్‌బీఐ మెయింటెన్స్ కార్యకలాపాలు చేపట్టినందున.. ఈ సమయంలో కస్టమర్లు లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయి. కాగా అర్థరాత్రి సమయంలో బ్యాంకింగ్ లావాదేవీలు దాదాపు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా బ్యాంకుల మెయింటనెన్స్ కార్యకలాపాలు ఈ సమయంలోనే జరుగుతుంటాయి.

ఈ వార్త కూడా చదవండి: ఈనెల 22 నుంచి మాస్టర్ కార్డులపై RBI ఆంక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement