Thursday, April 18, 2024

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల రికార్డు పాకిస్థాన్ జట్టు పేరిట నమోదైంది. ఆ జట్టు మొత్తం 170 మ్యాచ్‌లు ఆడి 105 విజయాలు సాధించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో టీమిండియా ఉంది. భారత్ జట్టు 142 మ్యాచ్‌లు ఆడి 91 విజయాలు అందుకుంది. మూడో స్థానంలో 76 విజయాలతో దక్షిణాఫ్రికా జట్టు ఉంది. సఫారీల టీమ్ 136 మ్యాచ్‌లు ఆడింది.

మరోవైపు నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా 72 (140 మ్యాచ్‌లు), ఐదో స్థానంలో న్యూజిలాండ్ 72 (145 మ్యాచ్‌లు), ఆరో స్థానంలో ఇంగ్లండ్ 71 (134 మ్యాచ్‌లు). ఏడో స్థానంలో వెస్టిండీస్ 63 (139 మ్యాచ్‌లు), 8వ స్థానంలో శ్రీలంక 61 (134 మ్యాచ్‌లు), 9వ స్థానంలో ఆఫ్గనిస్తాన్ 58 (84 మ్యాచ్‌లు), 10వ స్థానంలో ఐర్లాండ్ 41 (98 మ్యాచ్‌లు) విజయాలు సాధించాయి.

ఈ వార్త కూడా చదవండి: టీమిండియా క్రికెటర్‌కు కరోనా పాజిటివ్

Advertisement

తాజా వార్తలు

Advertisement