Thursday, May 2, 2024

రియాలిటీ షోకి హోస్ట్ గా కంగ‌నార‌నౌత్ – ట్రైల‌ర్ రిలీజ్

బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నార‌నౌత్ లాక్ అప్ రియాలిటీ షో కి హోస్ట్ గా చేస్తోంది. ఆ షో తాలూకా ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ లో కంటెస్టెంట్స్ చేతులకు బేడీలతో.. జైలు గదుల్లో ఉన్నారు. కంటెస్టెంట్స్ ఎవరైనా కానీ… అన్నపానీయాలు, స్నానాదికాలు అక్కడే. ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది. ఈ షో బిగ్ బాస్ కి మించిన కాంట్రవర్సీ, ఫైట్, రొమాన్స్ తో కూడి ఉంటుందని. డిజిటల్ కంటెంట్ నేపథ్యంలో పరిమితులు కూడా చాలా తక్కువ ఉంటాయి. అడ్వెంచర్, మసాలా కంటెంట్ తో కూడిన లాక్ అప్ షో ప్రోమో అంచనాలు పెంచేసింది. నిర్మాత ఏక్తా కపూర్ తో చేతులు కలిపిన కంగనా లాక్ అప్ రియాలిటీ షోని హోస్ట్ గా చేస్తున్నారు. లాక్ అప్ షో ఫిబ్రవరి 27నుండి ఏ ఎల్ టి బాలాజీ, ఎం ఎక్స్ ప్లేయర్ లో ఈ షో ప్రసారం కానుంది. డిజిటల్ కంటెంట్ విపరీతమైన ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో స్టార్స్ నయా ఆలోచనలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement