Saturday, May 11, 2024

ఆధ్యాత్మిక గురువు స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్ – 30వేల కిలోమీట‌ర్ల ‘బైక్’ జ‌ర్నీ స్టార్ట్

త‌న 30వేల కిలోమీట‌ర్ల బైక్ జ‌ర్నీని ప్రారంభించారు ఆధ్యాత్మిక గురువు, ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త స‌ద్గురు జ‌గ్జీ వాసుదేవ్. కాగా లండ‌న్
నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆయ‌న 100 రోజుల పాటు బైక్‌పై జ‌ర్నీ చేయ‌నున్నారు. సేవ్ సాయిల్ మూమెంట్‌లో భాగంగా ఆయ‌న బైక్ జ‌ర్నీ మొద‌లుపెట్టారు. లండ‌న్‌లో పార్ల‌మెంట్ స్క్వేర్ నుంచి ఈ జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. ఈ నేల‌, ఈ భూమి, ఈ మ‌ట్టిపై అవ‌గాహ‌న పెంచేదుకు స‌ద్గురు జ‌గ్జీ ఈ యాత్ర‌ చేప‌ట్టారు. 64 ఏళ్ల స‌ద్గురు యూరోప్‌, మిడిల్ ఈస్ట్ నుంచి ఆయ‌న ఢిల్లీ చేరుకోనున్నారు. అమ్‌స్ట‌ర్‌డామ్‌, బెర్లిన్‌, ప్రాగ్ న‌గ‌రాల మీదుగా BMW K1600 GT బైక్‌పై ఆయ‌న ట్రావెల్ చేస్తారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా భూసారం త‌గ్గుతోంద‌ని, సుమారు మూడు ల‌క్ష‌ల మంది రైతులు గ‌త 20 ఏళ్ల‌లో ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని, అందుకే తాను 24 ఏండ్ల నుంచి సేవ్ సాయిల్ ఉద్య‌మాన్ని సాగిస్తున్న‌ట్లు జ‌గ్జీ చెప్పారు. వ్య‌వ‌సాయ నేల‌ల్లో భూసారాన్ని పెంచాల‌న్న ఉద్దేశంతో అన్ని దేశాలు జాతీయ విధానాలు రూపొందించాల‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement