Saturday, December 7, 2024

Campaign – 50 సీట్లు గెలిస్తే గొప్పే – ఈసారి కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు – మోదీ


ఈ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లైనా గెలవదని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత హస్తం పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని ఎద్దేవా చేశారు. ఒడిశాలోని ఫుల్బానీలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్, బీజేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 26 ఏళ్ల క్రితం రాజస్థాన్​లో ఇదే రోజున (మే 11) మాజీ ప్రధాని వాజ్​పేయీ ప్రభుత్వం నిర్వహించిన పోఖ్రాన్ అణుపరీక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠను పెంచాయని గుర్తు చేశారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ద్వారా దేశ ప్రజల 500 ఏళ్ల నిరీక్షణకు బీజేపీ తెరదించిదన్నారు. ఒడిశాలో తొలిసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకున్న వ్యక్తి ఒడిశాలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వంలో సీఎం అవుతారని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement