Sunday, April 28, 2024

TSRTC: పండుగల వేళ స్పెషల్​ బస్సులు.. సొంతూళ్లకు పోయేవారికి ముందస్తు రిజర్వేషన్​!

తెలంగాణలో ఘనంగా జరిగే బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్​ ఆర్టీసీ పెద్ద సంఖ్యలో బస్సులను పెంచింది. పండుగల నేప‌థ్యంలో ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పంది ఆర్టీసీ. ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ దాకా ఈ దసరా స్పెషల్‌ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని రంగారెడ్డి రీజయన్‌ నుంచి దాదాపు 3వేలకు పైగా ఆర్టీసీ బస్సులను దసరా స్పెషల్స్‌గా జిల్లాలకు నడిపించడానికి అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

హైదరాబాద్​ సిటీలోని జేబీఎస్‌, సికింద్రాబాద్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, కోఠి వంటి ప్రాంతాల నుంచి దసరా స్పెషల్‌ బస్సులు నడుపుతారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో సిటీ నుంచి సొంత ఊళ్లకు వెళ్లడం కోసం ముందుగానే రిజర్వేషన్లు చేసుకునే ప్రయత్నాలు ప్రజలు మొదలుపెడుతున్నారు.

ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఐటీ ఉద్యోగులు, కోకాపేట్ సెజ్ వైపు వెళ్లేవారికి టీఎస్‌ఆర్‌టీసీ తీపి కబురు తీసుకొచ్చింది. TSRTC మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కొత్త బస్సుల వివరాలను ట్విట్టర్‌లో షేర్​ చేశారు. బస్సులు కోఠి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, లంగర్ హౌజ్, టిప్పుఖాన్ బ్రిడ్జి, బండ్లగూడ, తారామతిపేట, నార్సింగి మీదుగా నడుస్తాయి. మొదటి బస్సు ఉదయం 6:00 గంటలకు దిల్‌సుఖ్‌నగర్ నుండి బయలుదేరుతుంది. చివరి బస్సు రాత్రి 8:40 గంటలకు డిపో నుండి బయలుదేరుతుంది.

ఇక.. సెప్టెంబర్ 10వ తేదీన కొత్త వాహనాలను ప్రవేశపెట్టిన ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, దిల్‌సుఖ్‌నగర్-కోకాపేట్ మార్గంలో రద్దీని తగ్గించడానికి ప్రతి 40 నిమిషాలకు ఒక బస్సు నడుపుతోంది. మరిన్ని వివరాలకు 040-23450033/69440000 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

- Advertisement -

కాగా, మెదక్ చర్చికి ప్రత్యేక బస్సులను కూడా నడుతున్నట్టు ప్రకటించింది ఆర్టీసీ. రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రదేశాల నుండి బస్సులు ఏర్పాటు చేశారు. JBS బస్ స్టాప్, నారాయణఖేడ్, జహీరాబాద్ నుంచి బస్ ఈ సర్వీసులు ఉంటాయి. జహీరాబాద్‌ నుంచి మెదక్‌కు ఉదయం 6:30 గంటలకు బస్సు వెళ్లాల్సి ఉంది. మెదక్‌ నుంచి జహీరాబాద్‌కు తిరిగి మధ్యాహ్నం 2:30 గంటలకు బస్‌ ఉంటుంది. నారాయణఖేడ్ పట్టణం నుండి బస్సు ఉదయం 8:30 గంటలకు బయలుదేరి మెదక్ నుండి మధ్యాహ్నం 2:00 గంటలకు తిరిగి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement