Thursday, May 2, 2024

ఫిలిప్పీన్స్ ద‌క్షిణ‌భాగంలో.. భారీ భూకంపం

ఫిలిప్పీన్స్ ద‌క్షిణ‌భాగంలో భారీ భూకంపం సంభ‌వించింది..కాగా రాజధాని మనీలా కూడా భూకంప ప్రభావానికి గురైంది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 6.0గా నమోదైంది. దాదాపు అర నిమిషం పాటు భూమి కంపించింది. భూకంప కేంద్రం మిండానావో ఐలాండ్ లోని దావో డి ఓరో ప్రావిన్స్ లో 38.6 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. ఫిలిప్పీన్స్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement