Tuesday, May 7, 2024

Big Breaking: సోనియా గాంధీ పర్సనల్ కార్యదర్శిపై అత్యాచారం కేసు నమోదు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పీపీ మాధవన్‌పై రేప్​ కేసు నమోదైంది. 26 ఏళ్ల యువతి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అత్యాచారం, క్రిమినల్ బెదిరింపుల కేసు నమోదు చేసినట్లు సోమవారం తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిందితులు తనను ప్రలోభపెట్టారని, పెళ్లికి హామీ ఇచ్చారని యువతి ఆరోపించింది. బాధితురాలిపై అత్యాచారం చేశారని, ఈ విషయాన్ని చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు బెదిరించారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

జూన్ 25న ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు అందింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 (రేప్) మరియు 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి M హర్ష వర్ధన్ తెలిపారు. ద్వారకా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సీనియర్ రాజకీయ నేతకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న 71 ఏళ్ల వృద్ధుడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

కాగా, పోలీసు అధికారులు రాజకీయ నేత పేరు చెప్పనప్పటికీ, మాధవన్‌పై ఆరోపణలు వచ్చినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. మహిళ ఢిల్లీలో నివసిస్తుందని, ఆమె భర్త 2020లో చనిపోయారని అధికారులు తెలిపారు. భర్త కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పనిచేసేవాడని, అతను హోర్డింగ్‌లు అతికించేవాడని వారు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement