Sunday, May 5, 2024

కేంద్ర నిధులతోనే – రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు – సోము వీర్రాజు

కేంద్ర నిధులతో నే.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ఆదివారం కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ అభివృద్ధి పై, నికర జలాల వాటా పై నిన్నటి రోజున కడప జిల్లాలో రాయలసీమ రణభేరి పేరుతో నిర్వహించిన సభ విజయవంతమైందన్నారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది, దానికి కావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని పేర్కొన్నారు. అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి.. హోదా కన్నా ప్యాకేజి తోనే ఎక్కువ నిధులు సాధించామని గతంలో చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పై, కేంద్రం ఇస్తున్న నిధులపై బహిరంగ చర్చకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. గతంలో రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధుల కంటే ఎక్కువగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందనీ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రైల్వేలకి అభివృద్ధికి 65 వేల కోట్లు, రహదారుల అభివృద్ధికి 65 వేల కోట్లు ఇచ్చిన ఘనత కేంద్రం లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు అయినా నిర్మించిందా.. అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వని నిధులు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన అభిమానంతో మోడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ వినియోగించుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. నవరత్నాలను మించినటువంటి ఎక్కువ లబ్ధి, కేంద్ర ప్రభుత్వం పతకాలు వల్ల రాష్ట్ర ప్రజలు పొందుతున్నారు.. బిజెపి భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయితే రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.ఈ విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి పార్థసారథి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement