Sunday, April 28, 2024

Big Story: పొగాకు ఉత్పత్తిలో ప్రకాశం టాప్.. ఏపీలో 65శాతం ఇక్కడే సాగు

ఒంగోలు, ప్రభన్యూస్‌ బ్యూరో : పొగాకు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పొగాకు శాతాన్ని పరిశీలిస్తే ఒక్క ప్రకాశం జిల్లాలోనే 65శాతం పొగాకు ఉత్పత్తి అవుతోంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఒంగోలు పొగాకు బోర్డు రీజియన్‌ పరిధిలో మొత్తం 13 పొగాకు వేలం కేంద్రాలు ఉండగా, తొలివిడతగా ఈ నెల 14 నుంచి ఏడు కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు-1, కొండెపి, వెల్లంపల్లి, పొదిలి, కందుకూరు 1,2 కేంద్రాలతో పాటు, నెల్లూరు జిల్లాలోని డీసీపల్లిలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రెండో విడతగా ఈ నెల 28 నుంచి ఒంగోలు-2, టంగుటూరు-1, కనిగిరి, కలిగిరి కేంద్రాల్లో అమ్మకాలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ ఏడాది 10.69 మిలియన్ల కిలోల ఉత్పిత్తి తగ్గనుంది. ఎస్‌బీ ఎస్‌, ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌ ప రిధిలో 9 వేలం కేంద్రాలు ఉండగా, నెల్లూరు జిల్లా కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండు రీజియన్ల పరిధిలో ఈ ఏడాది 30,368 మంది రైతులు 23,962 బ్యారన్ల కింద 50,081 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగుకు బోర్డు అనుమతి ఇచ్చింది.

కానీ 47,507.71 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. అందులో 79.10 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా..68.41 మిలియన్‌ కిలోల ఉత్పత్తి కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ప్రకాశం జిల్లాలో ఒంగోలు 1,2, వెల్లంపల్లి 1,2, టంగుటూరు 1,2, కొండెపి, కందుకూరు 1,2, పొదిలి 1,2, డీసీపల్లి, కలిగిరి బోర్డు వేలం కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో ఒక్క చీరాల మినహా అన్ని ప్రాంతాల్లో రైతులు పొగాకు పంటను సాగు చేస్తున్నారు. ఈ పొగాకు పంట వలన ప్రకాశం జిల్లాలో 30,368 మంది రైతు కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. వేలాది మంది కార్మికులు పొగాకు పంట ఉపాధి కల్పిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది 23,962 బ్యారన్ల కింద 50,081 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగుకు బోర్డు అనుమతి ఇచ్చింది. కానీ 47,507.71 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. జిల్లాలో నల్లరేగడి నేలలు, తేలిక నేలల్లో పొగాకు పంట సాగవుతోంది. పొగాకు పంట పై కేంద్ర ప్రభుత్వానికి ఏడాదికి ఎక్సైజ్‌ డ్యూటీ పేరుతో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది.

అయితే ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నా.. పొగాకు రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణం అనుకూలించకపోవడం, పొగాకు ఉత్పత్తి జరిగినా గిట్టుబాటు ధరలు రాకపోవడం లాంటి కారణాలతో పొగాకు రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఏదైనా ఒక సంవత్సరం రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చినా.. ఆ తరువాత సంవత్సరం మాత్రం మళ్లీ మామూలే! అయితే ఇదిలా ఉండగా అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధరలు రాక.. పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ప్రకాశం జిల్లాలో అనేకం ఉండటం గమనార్హం. ఇక్కడి నేలలు పొగాకు పంట సాగుకు అనుకూలం కావడంతో రైతులకు నష్టాలు వ స్తున్నా ఎక్కువ మంది రైతులు పొగాకు సాగు చేయడం పరిపాటిగా మారింది. ప్రతి సంవత్సరం ఉత్పత్తి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇంత కష్టపడి పండించిన పొగాకును తీరా వేలం కేంద్రాల కు తీసుకెళితే గిట్టుబాటు ధర మాత్రం రావడం లేదు. వ్యాపారులు కుమ్మకై పొగాకు ధరలు బాగా తగింంచి కొనుగోలు చేయడం వలన తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గిట్టుబాటు ధరలు రాని సమయంలో రైతులకు మద్దతుగా నిలిచి ఆందోళన చేసినప్పుడు మాత్రం కాస్త ధరలు పెంచి కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత మళ్లీ మామూలే! పొగాకు బోర్డు అధికారులు, అధికార పార్టీకి చెందని ప్రజా ప్రతినిధులు స్పందించక పోవడంతోనే రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు.

1976లో పొగాకు బోర్డు ఏర్పాటు..

రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు పంటలను అమ్ముకునేందుకు పడుతున్న ఇబ్బందులపై జరిగిన అనేక ఆందోళనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 1976 జనవరి 1న పొగాకు బోర్డును ఏర్పాటు చేసింది. పొగాకు బోర్డు ఏర్పాటుతో ఉత్పత్తి అంచనా, గిట్టుబాటు ధర కల్పన, సకాలంలో డబ్బులు పంపిణీ, సాంకేతిక పరిజ్ఞానం అందించడం, ఎరువులు, పురుగుమందుల సరఫరా తదితర అవసరాలు సకాలంలో రైతాంగానికి ఏర్పాటు చేస్తుండటంతో రైతులకు కాస్త ఉపయోగంగా ఉంది. అయితే ఇటీవల కేంద్రం పొగాకు బోర్డును మూసివేయాలనే ప్రతిపాదనను ముందుక తీసుకొచ్చింది. దీంతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించి, పొగాకు బోర్డుకు ఉన్న చరిత్రను తెలియజేయడంతో ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంతి పీయుష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడం, తెగుళ్లు వెంటాడటంతో పొగాకు పంట ఉత్పత్తి తగ్గింది. 23,962 బ్యారన్ల కింద 50,081 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగుకు బోర్డు అనుమతి ఇచ్చింది. కానీ 47,507.71 హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు.
అందులో 79.10 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా..68.41 మిలియన్‌ కిలోల ఉత్పత్తి కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తద్వారా 10.69 మి.కిలోల ఉత్పత్తి తగ్గనుంది. జిల్లాలోని నల్లరేగడి పరిధిలోని కొండెపి వేలం కేం ద్రంలో కేజీ మేలిమి రకం పొగాకు అత్యధికంగా గతంలో రూ.203 రూపాయలు కలిని చరిత్ర సృష్టించింది. తేలిక నేలల పరిధిలోని కలిగిరి వేలం కేంద్రం పరిధిలో గరిష్టంగా గతంలో రూ.199 పలకడం జరిగింది. మొత్తంగా నల్లరేగడి నేలలోిల గ్రేడ్‌ -1 రకం పొగాకు కేజీ సగటునా రూ.116.98 రూపాయలు, తేలియ నేలల్లో పొగాకు కేజీ రూ.117.46 నమోదవడం పరిపాటిగా మారింది.

- Advertisement -

కిలో సగటు ధర రూ.160 ఇవ్వాలని డిమాండ్‌..

పొగాకు పంట ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో కిలో సగటు ధర రూ.160కి తగ్గకుండా ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గత గురువారం పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ధర తగ్గకుండా చూడాలని కోరారు. ఇదే విషయాన్ని రైతు ప్రతినిధులు కంపెనీ ప్రతినిధులను కలిసి తమ డిమాండ్లను కూడా తెలియజేశారు. ఈ ఏడాది తెగుళ్లతో పాటు, ఖర్చులు పెరగడంతో మద్దతు ధర ఇస్తేనే కొంత మేరయినా గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. 1977లో పొగాకు బోర్డు ఏర్పాటైన తరువాత ఇప్పటి వరకు వేలం కేంద్రాల్లో వ్యాపారులు, ఎగుమతి దారులు చెప్పిందే ధరగా నడిచేది. లో గ్రేడ్‌ పేరిట ధరలను మరింత తగ్గించేవారు. వారు చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ వచ్చింది. అయితే ఈ సారి ధరలు ఎలా ఉంటాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ పొగాకు పంట కోసం ప్రభుత్వం ఒక స్థిర నిధిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా వేలం కేంద్రాల కొనుగోళ్లలోకి దించి పొగాకు రైతులకు నష్టాలు రాకుండా చూడాలి. అలాగే గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా అటు ప్రభుత్వంతో పాటు, ఇటు ప్రజాప్రతినిధులు, బోర్డు అధికారుల పై ఎంతైనా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement