Tuesday, April 30, 2024

TOP STORY : ఒంట‌రిగా సెంచ‌రీ…

- Advertisement -

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. దీంతో ఎన్నికల సమయంలో టీడీపీ, వైసీపీలు ఫైనల్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతూ ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఈ నేపధ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 13వ తేదీ జరిగే ఎన్నికలను ఫైనల్‌ ఇన్నింగ్‌గా భావిస్తూ ఆ దిశగా తన మార్క్‌ను సాధించే దిశగా రాష్ట్రవ్యాప్తంగా ”ప్రజాగళం” యాత్ర చేపడుతూ సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న చంద్రబాబు ప్రస్తుత ఎన్నికల్లో సొంతంగా కనీసం సెంచరీ (వంద స్థానాలు) కొట్టాలని భావిస్తూ ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

తన 40 ఏళ్ల రాజకీయ పోరాటానికి సార్వత్రిక ఎన్నికలు చివరి ఇన్నింగ్స్‌గా చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే భీకరమైనపోరాటానికి ఆయన నడుం బిగించారు. సీఎం జగన్‌తో మ్యాచ్‌ టైట్‌గా ఉంటుందనే అంచనాతో ముందే ఆయన టీడీపీని హైఅలర్ట్‌ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన 40 ఏళ్ల అనుభవాన్ని రంగరిస్తూ అడుగడుగునా అన్ని అంశాలపై లోతుగా ఫోకస్‌ పెడుతూ దూకుడుగా ముందుకు సాగుతున్నా రు. మొహమాటాలకు తావు లేకుండా పోటీలో ఉన్న అభ్యర్థులకు సూటిగా సూచనలతోపాటు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. నిత్యం రెండు నుంచి మూడు సార్లు సర్వే నివేదికలను పరిశీలిస్తూ ఆయా ప్రాంత జనం నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంపై తన పట్టును నిలుపుకోవాలని చంద్ర బాబు వ్యూహరచన చేస్తున్నారు. ప్రతి గంట కీలకంగా భావిస్తూ ఆయన అన్ని అంశాల్లోనూ జాగ్రత్త పడుతు న్నారు.

మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీలకు కేటాయిం చిన స్థానాలు కూడా చేజారకుండా ఉండేలా ప్రత్యేక వ్యూహరచనతో ఆయా స్థానాలపై కూడా ఫోకస్‌ పెట్టి నట్లు చెబుతున్నారు. వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలను సైతం లెక్కజేయకుండా గెలుపే లక్ష్యంగా అలుపెరుగని ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలయ్యాక అన్నివర్గాల ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకుల్లోనూ చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలపైనే జోరుగా చర్చ సాగుతోంది. సార్వత్రిక ఎన్నికలను ఆయన ఫైనల్‌ ఇన్నింగ్స్‌గా భావిస్తూ ఆ దిశగానే దూకుడుగా ఎన్నికల మ్యాచ్‌ ఆడేందుకు తమ జట్టును సిద్ధం చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీ య వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ప్రతి గంట కీలకంగా.. జాగ్రత్త పడుతున్న చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికలకు మరో 40 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపధ్యంలో చంద్ర బాబు ప్రతి గంట కీలకంగా భావిస్తున్నారు. ఆ దిశగానే మండుతెండలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్కజేయకుండా వయస్సు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలను కేర్‌ చేయకుండా గెలుపే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. గతంలో వలే అతి విశ్వాసానికి తావు లేకుండా వాస్తవాలే ప్రామాణికంగా క్యాడర్‌ను కమిట్మెం ట్‌తో ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. అందుకోసం ఆయన అలుపెరుగని ప్రాక్టీస్‌ చేస్తూ మ్యాచ్‌లో గెలిచి తన సత్తాను చాటుకోవా లని యోచిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాల పైనే జోరు గా చర్చ సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలం టే చంద్రబాబు, జగన్‌ల మధ్య సాగుతున్న ఎన్నికల యుద్ధాన్ని టీడీపీ ఫైనల్‌ మ్యాచ్‌గా భావిస్తోన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఫైనల్‌ పోరుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్లేషకులు కూడా అభిప్రా యపడుతున్నారు.

ఒంటరిగా సెంచరీ కొట్టాలని.. పక్కా ప్లాన్‌
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నిక ల్లో టీడీపీ 2014 ఎన్నికల తరహాలోనే పాత మిత్రులైన జనసేన, బీజేపీలతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే మూడు పార్టీలు కూటమిగా రంగంలోకి దిగాయి. 21 స్థానాల్లో జనసేన, 10 స్థానా ల్లో బీజేపీ పోటీ చేస్తుండగా 144 స్థానాల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్ధులు బరిలో ఉన్నారు. అయితే జగన్‌ను ఎదుర్కొనేందుకు కూటమిగా ఎన్నికల సమరానికి సిద్ధమైన చంద్రబాబు ఒంటరిగా వంద సీట్లకు పైగా సాధించుకోవాలన్నా.. పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. 175 స్థానాల్లో సెంచరీ కొట్టి తన బలాన్ని చాటుకోవాలని యోచిస్తున్నారు. ఇదే సందర్భంలో మిత్ర పక్షాలకు కేటాయించిన స్థానాల్లో జనసేన, బీజేపీ అభ్యర్థులను కూడా గెలిపిం చుకుని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా బలమైన పునాది ని వేసుకోవాలని బాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లో మునుపెన్నడూ లేని విధంగా ప్రతి అంశాన్ని చంద్రబాబు లోతుగా అధ్యయనం చేసి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ప్రత్యర్థుల బలాలు, బలహీనతలపై ఫోకస్‌ చేసి గేమ్‌ ప్లాన్‌కు సిద్ధమవుతున్నారు.

జగన్‌తో మ్యాచ్‌ టైట్‌గా ఉంటుందనే..అంచనాతో హైఅలర్ట్‌
గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో తమకు తిరుగులేదని ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రుజువు చేసుకున్నా రు. అలాగే గడిచిన ఐదేళ్లలో ఆయన సంక్షేమం, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి పేదల్లో తన గ్రాఫ్‌ను మరింత పెంచుకున్నారు. ఈ నేపధ్యం లోనే జగన్‌తో ఎన్నికల యుద్ధం ఆషామాషి కాదని చంద్రబాబు ముందే ఆంచనా వేసినట్లు తెలుస్తోంది. ఆయనతో మ్యాచ్‌ టైట్‌గానే ఉంటుందని, సార్వత్రిక ఎన్నికల్లో 2014 ఫలితాలను పునరావృతం చేయా లంటే వ్యూహాత్మకమైన పక్కా ప్లాన్‌తో ముందుకు సాగాలని బాబు అంచనా వేస్తూ ఆ దిశగానే పార్టీ శ్రేణు లను హై అలర్ట్‌ చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అన్ని జిల్లాల్లో పనిచేస్తూ పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తూ వచ్చారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారం కూడా అదే దూకుడుతో జగన్‌పై ఘాటైన విమర్శలు చేస్తూ వైసీపీ ప్రభుత్వంలో పలు అక్రమాలు జరిగాయంటూ ప్రజ లకు వివరిస్తూ టీడీపీపై విశ్వాసాన్ని మరింత పెంపొం దించేలా చంద్రబాబు తన ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement