Monday, May 6, 2024

సోలార్ కారు – కొట్టేయ్ షికార్లు

ఇంధ‌న ధ‌రలు ఆకాశానంటుతున్నాయి. దాంతో జ‌మ్ముక‌శ్మీర్ కి చెందిన ఓ గ‌ణిత ఉపాధ్యాయుడు..సోలార్ కారుని రూపొందించారు. ఈ కారుని త‌యారు చేయ‌డానికి 13సంవ‌త్స‌రాలు ప‌ట్టింద‌ట‌. పెరిగిన ఇంధన ధరలతో అల్లాడుతున్న వాహనదారులకు.. పరిష్కార మార్గాన్ని చూపారు. రాబోయే పదేళ్లలో.. చమురు ధరలు మరింత పెరుగుతాయన్న ఆలోచనతో సోలార్ కారును.. రూపొందించారు. కాశ్మీర్‌కు చెందిన బిలాల్ అహ్మద్ అనే గణిత ఉపాధ్యాయుడు సోలార్ వాహనాన్ని కనిపెట్టాడు. 13 ఏళ్ల కఠోర శ్రమ, తర్వాత బిలాల్ అహ్మద్ ఈ మైలురాయిని చేరుకున్నారు.

శ్రీనగర్‌లోని సనత్ నగర్‌కు చెందిన బిలాల్ సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని సహేతుకమైన ధరతో రూపొందించారు. వాహనం లోపల ఛార్జింగ్ స్టేషన్ మరియు బాడీపై సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. 2009లో కొనుగోలు చేసిన తన కారును మోడిఫై చేసి, దానిని అభివృద్ధి చేసేందుకు రూ.15 లక్షలు వెచ్చించినట్లు సమాచారం. గత 13 ఏళ్లుగా ఈ కారును డెవలప్ చేయడానికి పోరాడిన ఆయన తాజాగా దీన్ని డిజైన్ చేశారు. తన కొత్త సోలార్ ఆటోమొబైల్ రూపకల్పనకు, అతను ఆటోమోటివ్ నిపుణుల సలహాలను కూడా ఉపయోగించాడు.సాధారణంగా సోలార్ ప్యానెళ్లపై పడే మంచును తొలగించేందుకు బిలాల్ రిమోట్ ద్వారా నియంత్రించబడే యంత్రాన్ని రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement