Friday, May 17, 2024

సోష‌ల్ మీడియాలో మ‌హేశ్ బాబుని ఫాలో అవుతోన్న – బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ సంపన్నుడు బిల్ గేట్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేశ్ బాబుని ఫాలో అవుతున్నారు. లక్షల కోట్ల విలువ చేసే ఐటీ వ్యాపార సామ్రాజ్యాధినేత అయిన బిల్ గేట్స్ తనకున్న సంపద ద్వారా ప్రపంచవ్యాప్తంగా దాతృత్వ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయనతో ప‌రిచ‌యం కోసం దేశాధినేతలే ప్రయత్నాలు చేస్తుంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవలే తన కుటుంబ సభ్యులతో న్యూయార్క్ పర్యటనలో బిల్ గేట్స్ ను కలిశారు. ఈ సందర్భంగా వారు గేట్స్ తో ఓ ఫొటో కూడా దిగారు. మహేశ్ బాబు ఎంతో వినయవిధేయతలున్న వ్యక్తి, పైగా నిరాడంబరుడు. ఇంకేముంది… బిల్ గేట్స్ కు యమాగా నచ్చేశాడు. సోషల్ మీడియాలో చాలా తక్కువ మందిని ఫాలో అయ్యే ఈ ఐటీ దిగ్గజం ఇప్పుడు మహేశ్ బాబును అనుసరిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లోనూ, ట్విట్టర్ లోనూ మహేశ్ ను ఫాలో అవుతున్నారు. ఇక మహేశ్ అభిమానుల ఆనందం అంతాఇంతా కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement