Monday, May 6, 2024

న‌డుము బెల్టులో దాచి 61 కిలోల బంగారం స్మ‌గ్లింగ్‌.. ముఠాని ప‌ట్టుకున్న ముంబై పోలీసులు

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 61కేజీల గోల్డ్‌.. అవును ముంబై ఎయిర్‌పోర్టులో బంగారం పెద్ద‌మొత్తంలో పట్టుబడింది. 61కేజీల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు ఇవ్వాల సీజ్‌ చేశారు . స్మ‌గ్లింగ్ చేస్తున్న ఏడుగురిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. దాని విలువ 32 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు.

– ఇంట‌ర్నెట్ డెస్క్‌, ఆంధ్రప్ర‌భ‌

ముంబ‌యిలో రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు 61 కిలోల బంగారం సీజ్‌ చేశారు. నడుముకు పెట్టుకున్న బెల్ట్‌లో గోల్డ్‌ బిస్కెట్స్‌ను దాచి సీక్రెట్‌గా తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు . UAE నుంచి వచ్చిన నలుగురిని.. దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి అని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు . UAEలో స్పెషల్‌గా బెల్ట్‌లను తయారు చేయించి.. అధికారుల కళ్లుగప్పి బంగారం తరలించేందుకు యత్నించారు స్మగ్లర్లు.

అయితే.. చాకచక్యంగా వ్యవహరించిన కస్టమ్స్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆఫ్రికా దేశం టాంజానియా నుంచి దోహా మీదుగా ముంబ‌యికి వచ్చారు స్మగ్లర్లు. కాగా, దోహా ఎయిర్‌పోర్టులో వారికి గోల్డ్‌ బిస్కెట్స్‌ ఉన్న బెల్ట్‌ను సూడాన్‌ జాతీయుడు అప్పగించినట్టు తెలుస్తోంది. వారిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు.. ఎక్కడి నుంచి బంగారం తరలిస్తున్నారు..? ఎవరి కోసం తీసుకొచ్చారు..? అన్న విష‌యాల‌పై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇటీవలి విదేశీ కరెన్సీ స్వాధీనం నేపథ్యంలో, అధికారులు ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రదేశాల నుంచి విమానాల ద్వారా వచ్చే ప్రయాణికులను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.



గోల్డ్​ బిస్కట్స్​ని తీసుకొచ్చి ఈ బెల్ట్​లోనే..
Advertisement

తాజా వార్తలు

Advertisement