Saturday, May 4, 2024

గాయ‌కుడు మ‌నోకి.. డాక్ట‌రేట్

సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్ దేశానికి చెందిన రిచ్ మండ్ గాబ్రియెల్ యూనివర్సిటీ గాయకుడు మనోకు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని మనో స్వయంగా వెల్లడించారు. భారతీయ సినీ పరిశ్రమలో గాయకుడిగా, సంగీతకారుడిగా 38 ఏళ్ల కెరీర్ లో 15 భాషల్లో 25 వేలకు పైగా పాటలు పాడినందుకు తనకు ఈ డాక్టరేట్ ఇచ్చారని వివరించారు. ఈ గౌరవం లభించినందుకు ఆనందంగా ఉందని, తన అభిమానులకు, మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు మనో ట్వీట్ చేశారు. తొలినాళ్లలో అచ్చం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలా పాడుతున్నాడే అనిపించుకున్న మనో… ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నారు. వేల సంఖ్యలో సినీ, ప్రైవేటు గీతాలు ఆలపించడమే కాదు, నటుడిగానూ, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ రాణించారు. తన పాటలతో తెలుగు, తమిళ వాళ్ళని మెప్పించారు. . తెలుగు, తమిళ్ లో ఎక్కువ పాటలు పాడినా భారతదేశంలోని 15 భాషల్లో కూడా మనో పాటలు పాడారు. సింగర్ గా ఓ వైపు ప్రేక్షకులని మెప్పిస్తునే మరోవైపు ప్రముఖ హీరోలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కూడా సినిమాలు చేశాడు. గత కొన్నాళ్ల నుంచి టెలివిజన్ రంగంలో కూడా పలు టీవీ షోలకు జడ్జిగా హాజరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement