Monday, April 29, 2024

టాస్ గెలిచిన ముంబై – బ్యాటింగ్ చేయ‌నున్న కెకెఆర్

టాస్ గెలిచిన ముంబై – బ్యాటింగ్ చేయ‌నున్న కెకెఆర్

ముంబై – ముంబై ఇండియన్స్ తన సొంత మైదానంలో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి కోల్ కోతా నైట్ రైడ‌ర్స్ కి బ్యాటింగ్ అప్ప‌గించింది.. కాగా, ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్‌కు IPL-2023 ప్రారంభం మంచిగా లేదు. మూడు మ్యాచ్‌లు ఆడి, అందులో రెండు ఓడిపోయింది. ఇప్పుడు ఈ జట్టు ఆదివారం తమ సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరుకి సిద్దమైంది. కోల్‌కతా మంచి రిథమ్‌లో ఉన్నప్పటికీ ముంబైని ఓడించడం అంత సులభం కాకపోవచ్చు. దానికి ప్రధాన కారణం ముంబై తన స్వంత మైదానంలో ఆడటమే.. ఈ మ్యాచ్ కూడా ఫ‌లితం చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ వెళ్లే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు.. ఇది ఇలా ఉంటే ముంబై రెగ్యూల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఈ మ్యాచ్ ఆడ‌క‌పోవ‌డంతో సూర్య‌కుమార్ యాద‌వ్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.. అలాగే క్రికెట్ గాడ్ స‌చిన్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ ఈ మ్యాచ్ ద్వారా ఐపిఎల్ లో అరంగేట్రం చేస్తున్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement