Monday, April 29, 2024

నేడు దివంగ‌త న‌టి సిల్క్ స్మిత జయంతి .. ఆమె గురించి ప‌లు విశేషాలు ..

నేడు సిల్క్_స్మిత జ‌యంతి.. ఆమె గురించి ప‌లు విశేషాలు తెలుసుకుందాం. సిల్క్ స్మిత ఆమె అస‌లు పేరు ఏలూరు విజయలక్ష్మి..టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక సిల్క్ స్మితగా మారిపోయింది..1980-90 ల్లో ఎదురులేని న‌టిగా చెలరేగిపోయింది. వ్యాంపు పాత్రలకి ఎంత విలువ ఉంటుందో తనముందు తరం వాళ్ళని చూసి కూడా పట్టించుకోలేదు, ప్రతీ పాత్రలో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయాల‌ని అనుకుంది.. అందుకే ఎవ్వ‌రూ చేయ‌ని పాత్ర‌ల‌ని చేసింది. రేర్ గా ఉండే వాయిస్, ఎవరికీ ఉండని కళ్ళు తనకున్న పెద్ద ఎస్సెట్స్. సినిమాలో హీరో హీరోయిన్స్ కంటే తనకోసం వచ్చే ఆడియన్స్ ని సొంతం చేసుకున్నసిల్క్ స్మిత పెర్ఫార్మెన్స్ వయసు 36 ఏళ్ళే..కనీసం నలభయ్యోపడి అంటే కూడా తెలుసుకోవాల్సిన పని లేకుండా నెత్తురు తప్ప ఏం వుందీ శరీరంలో అనుకుందేమో ధైర్యంగా అనంత‌లోకాల‌కి చేరుకుంది..బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

సింగీతం లాంటి పెద్ద దర్శకుడు తీసిన ఆదిత్య 369 లాంటి క్లాసిక్ చిత్రంలో సిల్క్ చేత ‘జాణవులే నెరజాణువులే ‘అని డ్యాన్స్ చేయించడం చూస్తే సిల్క్ స్మిత కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థ‌మ‌వుతుంది. ఇదే పాటకి ఇంకే హీరోయిన్ చేసినా కుర్చీలోంచి లేచి వెళ్లిపోయేవారు. కానీ సిల్క్ క్రేజే వేరు. ఇక ‘గీతాంజలి చిత్రంలో ‘జగడం జగడం ‘పాటలో సర్రున మిస్సైల్ మహారాణి లా కార్ దిగి మెరుపులా కనిపించి వెళ్ళిపోయే సిల్క్ స్మిత ఒక తరానికి చిలిపి ఊహ అంతే. అందుకే సీతాకోక చిలుక సినిమాలో పద్ధతైన పాత్ర వేసి సాంప్రదాయ వాదుల అహాన్ని చల్లార్చింది. కొన్ని జీవితాలు రాజీపడి బ్రతకలేవు అలాంటివాళ్ళు ఈ లోకంలో ఉండ‌లేరు. ఇక ప్ర‌స్తుత కాలంలో చీర్ గళ్స్, క్లబ్ డ్యాన్సర్స్, సినిమాల ఆడియో వీడియో ఫంక్షన్స్ లో డ్యాన్సులు చేసే సోకాల్డ్ హీరోయిన్స్ వ‌చ్చారు కానీ.. ఆనాటి కాలంలోనే ఈ విధ‌మైన పాత్ర‌లు ఎన్నో వేసింది. అందుకే నేటి త‌రానికి తీసిపోని విధంగా సిల్క్ స్మిత చిర‌స్మ‌ర‌ణీయురాలిగా మిగిలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement