Sunday, May 5, 2024

అద‌ర‌హో అనిపించిన ర‌ణ్ బీర్ క‌పూర్ – శంషీరా టీజ‌ర్ రిలీజ్

త‌న న‌ట‌న‌తో అద‌ర‌హో అనిపించాడు బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్. శంషీరా చిత్రం నుండి టీజ‌ర్ రిలీజ్ అయింది. క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.. ఈ చిత్రంలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌, సంజ‌య్ ద‌త్, వాణీ క‌పూర్ న‌టిస్తున్నారు. అయితే ఈ సినిమాకు చెందిన ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేయ‌నున్నారు. త‌మ తెగ ప్ర‌జ‌ల‌ను కాపాడుకునేందుకు ర‌ణ్‌బీర్ విరోచిత పోరాటం చేస్తారు. విల‌న్ పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ న‌టించారు. ఇద్ద‌రి మ‌ధ్య ఉత్కంఠ‌భ‌రిత‌మైన సీన్స్ ఉండ‌నున్నాయి. ఫిల్మ్ ట్రైల‌ర్‌ను హిందీ, తెలుగు భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. సంజ‌య్ ద‌త్‌, వాణీక‌పూర్‌లు త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో ఈ ఫిల్మ్ టీజ‌ర్‌ను పోస్టు చేశారు. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 22వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement