Thursday, May 2, 2024

Breaking: నిర్మ‌ల్‌లో దొరికిన‌ సర్వీస్ రివాల్వర్.. పోగొట్టుకున్నారా, చోరీ అయ్యిందా?

నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం దివ్య నగర్‌లో సఖీ కేంద్రం పక్కన గల బహిరంగ ప్రదేశంలో ఓ సర్వీస్ రివాల్వర్ క‌నిపించింది. దీంతో ఆ కాలనీవాసులు ఆందోళన చెందారు. బహిరంగ ప్రదేశంలో ఓ బండ‌రాయిమీద ఉన్న‌ సర్వీస్ రివాల్వర్, ఐదు బుల్లెట్ లను గ‌మ‌నించారు స్థానికులు. కాగా, 108 కాల్ సెంట‌ర్ నుంచి స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి వెళ్లి పిస్ట‌ల్‌తోపాటు, బుల్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై త‌దుప‌రి విచారణ జ‌రుపుతున్న‌ట్టు తెలిపారు. స్థానికులు భ‌య‌ప‌డి ఎవ‌రికి చెప్పాలో తెలియ‌క 108కు ఫిర్యాదు చేయడంతో ఈ ఘ‌ట‌న‌ వెలుగులోకి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement